మొబైల్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఐకూ 13’ వచ్చేసింది. ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘ఐకూ’.. తన ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఐకూ 13ని నేడు భారత మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఐకూ 12కు కొనసాగింపుగా ఇది లాంచ్ అయింది. గేమింగ్ లవర్స్ కోసం ఐకూ క్యూ2 చిప్‌ను ఇచ్చారు. అలానే హీట్‌ని కంట్రోల్ చేయడానికి 7,000 ఎస్క్యూ ఎంఎం వ్యాపర్ ఛాంబర్‌ను అందించారు. ఐకూ 13 ఫోన్ 50 ఎంపీ సోనీ కెమెరా, 6000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీతో వచ్చింది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఫుల్ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం.
ఐకూ 13 ఫోన్ రెండు వేరియంట్లలో వచ్చింది. 12జీబీ+256జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.54,999గా ఉండగా.. 16జీబీ+512 వేరియంట్ ధరను రూ.59,999గా కంపెనీ నిర్ణయించింది. ఇది లెజెండ్, నార్డో గ్రే రంగుల్లో అందుబాటులో ఉంది. ఐకూ 13 విక్రయాలు డిసెంబర్ 11 నుంచి ప్రారంభం కానున్నాయి. అమెజాన్ సహా ఐకూ ఈ-స్టోర్‌లో కొనుగోలు చేయొచ్చు. లాంచ్ ఆఫర్ కింద హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డుపై రూ.3 వేల డిస్కౌంట్ పొందొచ్చు. వివో, ఐకూ ఫోన్ల ఎక్స్‌ఛేంజ్‌పై రూ.5వేల వరకు డిస్కౌంట్ ఉంది.
ఐకూ 13లో 6.82 ఇంచెస్ 2కె ఎల్‌టీపీఓ అమోలెడ్ డిస్‌ప్లేను ఇచ్చారు. 144 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేటు,1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఈ స్క్రీన్ సొంతం. ఆండ్రాయిడ్ 15తో పనిచేసే ఫన్‌టచ్ 15 ఓఎస్‌తో ఔటాఫ్‌ది బాక్స్ వస్తోంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ను ఇచ్చారు. ఐకూ 13 వెనకవైపు 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 921 సెన్సర్ ఆప్టికల్, 50 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ సెన్సర్, 50 ఎంపీ టెలీ ఫొటోలెన్స్ ఉంది. సెల్ఫీల కోసం 32 ఎంపీ కెమెరా ఉంది. 6000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇవ్వగా.. ఇది 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఐపీ68, ఐపీ69 రేటింగ్‌ను ఇచ్చారు.