NTV Telugu Site icon

iQoo 12 5G Launch: ఆండ్రాయిడ్‌ ఫన్‌టచ్‌ ఓఎస్ 14తో ఐకూ కొత్త ఫోన్‌!

Iqoo 12 5g Launch

Iqoo 12 5g Launch

iQoo 12 5G Launch and Price in India: చైనాకు చెందిన మొబైల్‌ తయారీ కంపెనీ ‘ఐకూ’ నుంచి మరో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ వస్తోంది. నవంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించబడిన ‘ఐకూ 12’.. డిసెంబర్ 12న భారతీయ మార్కెట్లో లాంచ్ కానుంది. 12 లైనప్‌లో ఐకూ 12 మరియు ఐకూ 12 ప్రో ఉండగా.. బేస్ మోడల్ (ఐకూ 12 ) డిసెంబర్ 12న లాంచ్ కానుంది. అయితే హై-ఎండ్ ప్రో వేరియంట్ ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా తెలియరాలేదు. ఐకూ 12 ఫీచర్లను ఓసారి చూద్దాం.

iQoo 12 5G Specs:
ఐకూ 12 5G స్మార్ట్‌ఫోన్‌ భారతదేశంలో ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఫన్‌టచ్‌ ఓఎస్ 14తో లాంచ్ అవుతుందని కంపెనీ ప్రకటించింది. దాంతో దేశంలో లాంచ్ చేయబడిన మొదటి పిక్సెల్ కాని స్మార్ట్‌ఫోన్‌గా నిలవనుంది. ఐకూ 12 ఫోన్ దేశంలో అమెజాన్ మరియు అధికారిక ఐకూ ఇ-స్టోర్ ద్వారా మాత్రమే కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.

iQoo 12 5G Price:
చైనాలో 12 5G స్మార్ట్‌ఫోన్‌ 12GB + 256GB మరియు 16GB + 512GB వేరియంట్‌లు 3,999 (దాదాపు రూ. 45,000) యువాన్‌లు మరియు 4,299 (దాదాపు రూ. 50,00) యువాన్‌లు ఉన్నాయి. టాప్-ఆఫ్-లైన్ 16GB RAM + 1TB ఎంపిక 4,699 (దాదాపు రూ. 53,000) యువాన్‌లుగా ఉంది. ఈ మోడల్ చైనాలో బర్నింగ్ వేలో లెజెండ్ ఎడిషన్ మరియు ట్రాక్ వెర్షన్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.

iQoo 12 5G Camera:
ఐకూ 12 5G డిస్‌ప్లేకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 6.78 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లే ఈ ఫోన్‌ సొంతం. 1,260×2,800 పిక్సెల్‌ రిల్యూషన్‌తో కూడిన 1.5K, 144Hz రిఫ్రెష్ రేట్‌ ఈ స్క్రీన్‌ ప్రత్యేకత. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ ఆక్టా-కోర్ 4nm స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 SoC ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 100ఎక్స్‌ డిజిటల్‌ జూమ్‌తో కూడిన 64 మెగాపిక్సెల్ కెమెరాను ఇవ్వనున్నారు. సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Also Read: Diamond Duck: క్రికెట్‌లో ‘డైమండ్ డ‌క్’ అంటే ఏంటో తెలుసా?

iQoo 12 5G Battery:
చైనాలో 12 5G స్మార్ట్‌ఫోన్‌ 120W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ చేసే 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. 203 గ్రాముల బరువుతో 163.22mm x 75.88mm x 8.10mm పరిమాణం కలిగి ఉంటుంది.