Site icon NTV Telugu

IPS Officers Transfer : తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు

Telangana Police

Telangana Police

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అంశంపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్, రాష్ట్ర డీజీపీతో చర్చలు జరిపారు. దాదాపు 60 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరీంనగర్, రామగుండం సీపీలు, నల్గొండ, సిరిసిల్ల, వనపర్తి, మహబూబ్​ నగర్ ఎస్పీలు బదిలీ అయిన వారి జాబితాలో ఉన్నారు. ఇక రామగుండం సీపీగా సుబ్బారాయుడిని నిమించింది ప్రభుత్వం. మల్కాజిగిరి డీసీపీగా జానకి ధరావత్‌ను నియమించింది.

Also Read : Padma Awards 2023: పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

ఖమ్మం సీపీగా సురేష్‌, జగిత్యాల ఎస్పీగా భాస్కర్‌, విమెన్‌ సెఫ్టీ ఎస్పీగా పద్మజ నియమించినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. జనవరి 4న 29మంది ఐపీఎస్ ల బదిలీలు జరిగాయి. ఈ నెలలోనే ఐపీఎస్ ల బదిలీలు జరగడం ఇది రెండోసారి. లాంగ్ స్టాండింగ్ పీరియడ్ లో ఉన్నవారిని బదిలీలు చేయడం జరిగింది. ఐపీఎస్ అధికారుల బదిలీలకు సంబంధించి డీజీపీ అంజనీ కుమార్.. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో సమావేశం నిర్వహించినట్లు సమాచారం అందుతోంది.

Also Read : Ambati Rambabu: పవన్ ఎంటర్ టైనర్ మాత్రమే.. జగన్ జనం మనసు గెలిచిన ధీరుడు

Exit mobile version