NTV Telugu Site icon

New RAW Chief: ‘రా’ అధిపతిగా ఐపీఎస్ అధికారి రవి సిన్హా నియామకం

Raw Chief

Raw Chief

New RAW Chief: ఛత్తీస్‌గఢ్ కేడర్‌కు చెందిన సీనియర్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారి రవి సిన్హా సోమవారం రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW) కొత్త చీఫ్‌గా నియమితులయ్యారు. భారత నిఘా విభాగమైన రీసెర్చి అండ్‌ అనాలసిస్‌ వింగ్‌(RAW ) అధిపతిగా 1988 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి రవిసిన్హాను సర్కారు నియమించింది. ఈ నిర్ణయానికి ‘నియామకాలపై కేంద్ర మంత్రుల కమిటీ’ ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read: Thane Court: మైనర్ బాలికపై అత్యాచారం, ఆపై హత్య.. నిందితుడిని నిర్ధోషిగా ప్రకటించిన థానే కోర్టు

ఇప్పటికే ఈ పదవిలో కొనసాగుతున్న సమంత్‌ కుమార్‌ గోయల్‌ రిటైర్మెంట్‌ తీసుకోనున్నారు. జూన్ 30న తన పదవీకాలం పూర్తికానుండగా, ప్రస్తుత సమంత్ కుమార్ గోయెల్ స్థానంలో రవి సిన్హా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనకు ఇప్పటికే పలు మార్లు కేంద్ర ప్రభుత్వం పదవీకాలాన్ని పొడిగించింది. విదేశాల్లో అత్యంత కీలకమైన నిఘా కార్యకలాపాలను ‘రా’ నిర్వహిస్తోంది. 1988 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన సిన్హా ప్రస్తుతం క్యాబినెట్ సెక్రటేరియట్ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

Also Read: Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రయోగానికి శరవేగంగా ఏర్పాట్లు.. మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కు ఇస్రో సన్నద్ధం..!

ఛత్తీస్‌గఢ్‌ కేడర్‌కు చెందిన రవి గత ఏడేళ్లుగా ‘రా’ ఆపరేషనల్‌ విభాగంలో అధిపతిగా సేవలు అందిస్తున్నారు. ఆయన ఢిల్లీలోని సెయింట్‌ స్టీఫెన్స్‌ కళాశాలలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఆయన వ్యక్తిగత వివరాలు చాలా వరకు గోప్యంగా ఉన్నాయి. భారత ఇంటెలిజెన్స్‌ విభాగంలో ప్రతిభావంతుడిగా ఆయనకు పేరుంది. ఆయన వివిధ విభాగాల్లో పనిచేశారు. పొరుగు దేశాల్లో జరిగే పరిణామాలపై మంచి పట్టుంది. ముఖ్యంగా ఆయన జమ్ముకశ్మీర్‌, ఈశాన్య భారత్‌, వామపక్ష తీవ్రవాదంపై పనిచేశారని సమాచారం.

Show comments