NTV Telugu Site icon

IPL 2024: ఐపీఎల్ షెడ్యూల్ విడుదల.. తొలి మ్యాచ్ ఈ జట్ల మధ్య

Ipl

Ipl

ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తున్న ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్ లాంటిది. ఐపీఎల్ 17వ సీజన్ షెడ్యూల్ విడుదలైంది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్ మార్చి 22న హోమ్ గ్రౌండ్ ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో చెన్నై తలపడనుంది. మొత్తం.. 21 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ విడుదలైంది. సాధారణంగా డిఫెండింగ్‌ చాంపియన్‌- రన్నరప్‌ మధ్య మ్యాచ్‌తో క్యాష్‌ రిచ్‌ లీగ్‌ కొత్త ఎడిషన్‌ ఆరంభించడం ఆనవాయితీ. కానీ.. ఈ సారి అందుకు భిన్నంగా సీఎస్‌కే- గుజరాత్‌ టైటాన్స్‌కు బదులు.. సీఎస్‌కే- ఆర్సీబీతో పదిహేడవ ఎడిషన్‌ మొదలుపెట్టనున్నారు. తొలి 17 రోజులకు సంబంధించిన షెడ్యూల్‌లో భాగంగా పది జట్లు బరిలో దిగనున్నాయి. మార్చి 22- ఏప్రిల్‌ 7 వరకు ఈ మేరకు 21 ఈ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.

Read Also: Hyderabad: నగరంలోని బ్లడ్ బ్యాంకులపై డ్రగ్ కంట్రోల్ బ్యూరో సోదాలు..

ఇదిలా ఉంటే.. ఢిల్లీ క్యాపిటల్స్ తన తొలి రెండు మ్యాచ్‌లను విశాఖపట్నంలో ఆడనుంది. మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ ఢిల్లీలో జరుగుతున్నందున విశాఖలో ఆడనుంది. దేశంలో ఈ ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల కారణంగా ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ విడుదల కాలేదు. ఇప్పుడు 17 రోజులకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ అయింది. లోక్‌సభ ఎన్నికల తేదీల ప్రకటన తర్వాత మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్‌ విడుదల కానుంది. కాగా ఐపీఎల్‌–2024 పూర్తిగా భారత్‌లోనే నిర్వహించడం ఖాయమైనట్లు లీగ్‌ చైర్మన్‌ అరుణ్‌ ధూమల్‌ చెప్పిన విషయం తెలిసిందే.

Whatsapp Image 2024 02 22 At 5.42.02 Pm

Read Also: CM Revanth Reddy: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఈ నెలలో రెండు పథకాలు ప్రారంభం