Site icon NTV Telugu

IPL Retention 2025: విరాట్ కోహ్లీకి 21 కోట్లు.. ముగ్గురినే రిటైన్ చేసుకున్న బెంగళూరు!

Rcb Retention List

Rcb Retention List

ఐపీఎల్ 2025 రిటెన్షన్ లిస్ట్‌ వచ్చేసింది. ఐపీఎల్ చ‌రిత్ర‌లో మూడుసార్లు ఫైన‌ల్ చేరినా క‌ప్ కొట్ట‌ని రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్సీబీ) ఈసారి జట్టును పూర్తిగా మార్చేందుకు సిద్ధ‌మైంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2025 కోసం త‌మ బృందంలో కేవ‌లం ముగ్గురినే రిటైన్ చేసుకుంది. మిగతా అందరిని వేలంలోకి వదిలింది. ఈసారి ఆరుగురిని రిటైన్ చేసుకునేందుకు బీసీసీఐ అవకాశం ఇచ్చినా.. ఆర్సీబీ ముగ్గురిని మాత్రమే అట్టిపెట్టుకుని అందరికి షాక్ ఇచ్చింది.

2008 సీజ‌న్ నుంచి జ‌ట్టుతో కొన‌సాగుతున్న‌ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు తమ ప్రథమ ఎంపికగా తీసుకుంది. కోహ్లీకి రూ.21 కోట్లు చెల్లించేందుకు సిద్ధ‌మైంది. మిడిలార్డర్‌లో దూకుడుగా ఆడే ర‌జ‌త్ పాటిదార్‌ను రూ. 11 కోట్ల‌కు రిటైన్ చేసుకోగా.. యువ‌పేస‌ర్ య‌శ్ ద‌యాల్‌ను రూ. 5 కోట్ల‌కు రిటైన్ చేసుకుంది. అందరూ అనుకున్నట్లే కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌ను బెంగళూరు వదిలేసింది. దాంతో ఇప్పుడు కెప్టెన్ ఎవరన్నది ఆసక్తిగా మారింది. గత రెండు రోజులుగా విరాట్ మరలా కెప్టెన్సీ అందుకుంటాడని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు రిటైన్ లిస్ట్:
విరాట్ కోహ్లీ (రూ.21 కోట్లు)
రజత్ పటిదార్ (రూ.11 కోట్లు)
యశ్‌ దయాళ్‌ (రూ.5 కోట్లు)

Exit mobile version