NTV Telugu Site icon

IPL 2025 Retention: షాకింగ్ న్యూస్.. ఛాంపియన్ ప్లేయర్‌పై వేటు! కోల్‌కతా రిటైన్ లిస్ట్ ఇదే

Kkr Won

Kkr Won

ఐపీఎల్ 2025కి ముందు మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. వేలంకు సంబంధించిన రిటెన్ష‌న్ రూల్స్‌ను బీసీసీఐ ఇటీవల ప్ర‌క‌టించింది. ఓ ఫ్రాంచైజీ గరిష్టంగా ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకోవచ్చు. ప్రాంచైజీలు రిటెన్షన్‌ లిస్ట్‌ను సమర్పించేందుకు అక్టోబర్ 31 తుది గడువు. ఈ నేపథ్యంలో ఏ ప్రాంచైజీ ఎవరిని రిటైన్ చేసుకుంటుందో అని ఆసక్తిగా మారింది. అయితే డిపెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కొన్ని ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

కేకేఆర్ కేవలం నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మిస్టరీ స్పిన్నర్లు సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి.. పేసర్ హర్షిత్ రాణా, హిట్టర్ రింకూ సింగ్‌లను కోల్‌కతా రిటైన్ చేసుకుంటుందని ఓ స్పోర్ట్స్ సైట్ పేర్కొంది. మొదటి పిక్‌గా నరైన్‌, రెండో పిక్‌గా రింకూ ఉన్నాడట. మూడో ఆటగాడిగా వరుణ్ ఉండగా.. అన్‌క్యాప్డ్ ఆటగాడిగా రాణాను తీసుకుంటుందట. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ విషయంలో ఇంకా సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే మరొక ఫ్రాంచైజీ అతడికి మెగా డీల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Also Read: MS Dhoni-Sakshi: నీకు ఏమీ తెలియదు అంటూ.. ధోనీకే క్రికెట్‌ రూల్స్‌ నేర్పించిన సాక్షి!

అత్యంత షాకింగ్ న్యూస్ ఏంటంటే.. స్టార్ ఆల్‌రౌండర్‌, ఛాంపియన్ ప్లేయర్‌ ఆండ్రీ రస్సెల్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. ఒకవేళ అట్టిపెట్టుకుంటే ఏ జీతంలో ఉంచుకోవాలనే దానిపై చర్చ జరుగుతోందట. ప్రస్తుతం 1,2,3 స్థానంలో అతడిని నిలబెట్టుకునే ఉద్దేశం ఫ్రాంచైజీకి లేదని తెలుస్తోంది. 2014 నుంచి ఫ్రాంచైజీలో రస్సెల్‌ భాగంగా ఉన్నాడు. జట్టును రెండుసార్లు ఛాంపియన్‌గా చేయడంలో కీలక పాత్ర పోషించాడు. గత మెగా వేలంలో రూ.12 కోట్లకు రస్సెల్‌ను కేకేఆర్ నిలబెట్టుకుంది.