Orange & Purple Cap History: ఐపీఎల్ ‘క్యాప్’ల పోరు.. ఆధిపత్యం చలాయిస్తున్న జట్లు ఇవే..!
- చెన్నై సూపర్ కింగ్స్ 7 క్యాప్ లతో (3 ఆరెంజ్, 4 పర్పుల్) అగ్రస్థానం
- సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 క్యాప్ లతో (4 ఆరెంజ్, 2 పర్పుల్) రెండో స్థానం
- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 5 క్యాప్‌లు (4 ఆరెంజ్, 1 పర్పుల్)..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL Orange & Purple Cap History: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) కేవలం జట్ల మధ్య పోటీ మాత్రమే కాదు.. ఆటగాళ్ల వ్యక్తిగత ప్రతిభకు కూడా ఇది ఒక వేదిక. ప్రతి సీజన్‌లో బ్యాటింగ్‌లో సత్తా చాటిన వారికి ‘ఆరెంజ్ క్యాప్’, బౌలింగ్‌లో మాయ చేసిన వారికి ‘పర్పుల్ క్యాప్’ ఇస్తారు. వీటిని ఆటగాళ్ల ప్రదర్శనతో పాటు ఆయా జట్లు గౌరవంగా భావిస్తాయి. గత రికార్డులను పరిశీలిస్తే.. కొన్ని జట్లు ఐపీఎల్ ‘క్యాప్స్’లో స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. మరి ఆ వివరాలేంటో చూసేద్దామా..
Kurnool Murder Case: కర్నూలు జిల్లాలో దారుణం.. నిద్రపోతున్న భర్తను గొంతు కోసి చంపిన భార్య, ప్రియుడు!
Also Read
- Mahendragiri Varahi: మహేంద్రగిరి వారాహి రివ్యూ..
- IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ప్రభుత్వం అలర్ట్! జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు..!
- IT Minister Sridhar Babu: రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలకు బిగ్ బూస్ట్.. కొత్త GCC పాలసీపై ఐటీ మంత్రి కీలక ప్రకటన
ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా 7 క్యాప్‌లు (3 ఆరెంజ్, 4 పర్పుల్) సాధించి చెన్నై సూపర్ కింగ్స్ అగ్రస్థానంలో నిలిచింది. ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో ఈ జట్టుకు తిరుగులేదు. 2013 నుంచి 2015 వరకు వరుసగా మూడు ఏళ్ల పాటు పర్పుల్ క్యాప్ ను సీఎస్‌కే బౌలర్లే కైవసం చేసుకోవడం వారి నిలకడకు నిదర్శనం. 2009, 2013, 2021 సీజన్లలో బ్యాటర్లు కూడా తమ సత్తా చాటి ఆరెంజ్ క్యాప్ లను ఖాతాలో వేశారు.
ఇక పరుగుల వేటలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తనదైన ముద్ర వేసింది. ఈ జట్టు తరపున ఏకంగా 4 సార్లు ఆరెంజ్ క్యాప్‌లు అందుకుంది. 2017, 2018, 2019 వరుస సీజన్లలో వరుసగా మూడేళ్ల పాటు హైదరాబాద్ బ్యాటర్లే ఐపీఎల్ టాప్ స్కోరర్లుగా నిలిచారు. మొత్తం 6 క్యాప్ లతో (4 ఆరెంజ్, 2 పర్పుల్) ఈ జాబితాలో ఎస్‌ఆర్‌హెచ్ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇకపోతే ఆర్సీబీ పేరు వినగానే మెరుపు బ్యాటింగ్ గుర్తుకొస్తుంది. క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ వంటి మేటి ఆటగాళ్ల పుణ్యమా అని ఈ జట్టుకు 4 ఆరెంజ్ క్యాప్‌లు దక్కాయి. 2011, 2012, 2016, 2024 సీజన్లలో బెంగళూరు బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. 2021లో వచ్చిన ఒక పర్పుల్ క్యాప్‌తో కలిపి ఈ జట్టు మొత్తం 5 క్యాప్‌లను తన ఖాతాలో వేసుకుంది.
Bhatti Vikramarka : ప్రజల పక్షాన నిలబడేదే ప్రజాస్వామ్యం.. బీఆర్‌ఎస్ తీరుపై భట్టి ఫైర్..
లీగ్ లోకి ఆలస్యంగా వచ్చినప్పటికీ గుజరాత్ టైటాన్స్ (GT) సంచలన ప్రదర్శన చేసింది. 2023, 2025 సీజన్లలో ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లు రెండింటినీ ఒకే సీజన్‌లో సాధించి చరిత్ర సృష్టించింది. మరోవైపు పంజాబ్ కింగ్స్ కూడా మొత్తం 4 క్యాప్ లతో తన ఉనికిని చాటుకుంది. 2008 తొలి సీజన్ లోనే ఆరెంజ్ క్యాప్ ను, ఆ తర్వాత 2020లో కూడా దీనిని గెలుచుకుంది. బౌలింగ్‌లో 2018, 2024లో పర్పుల్ క్యాప్ లను సొంతం చేసుకుంది.
తాజావార్తలు
-
Parliament Session 2026: 2015 రికార్డు బ్రేక్.. పార్లమెంట్ సమావేశాల ముగింపులో జాప్యంపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు
-
Soori: భారీగా పెరిగిన కమెడియన్ సూరి రెమ్యూనరేషన్.. రేంజ్ చూస్తే షాకవ్వాల్సిందే!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
Realme 16T 5G: 8000mAh బ్యాటరీతో అదరగొట్టే 5G ఫోన్.. 50MP కెమెరా, 144Hz డిస్‌ప్లే
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
ట్రెండింగ్
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!