NTV Telugu Site icon

IPL Auction 2023: ఐపీఎల్ వేలంలో 1166 మంది ప్లేయర్లు.. 77 ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీల ఆసక్తి

Ipl

Ipl

IPL 2023 Auction: ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా ప్రేక్షకులను అలరించేందుకు ఐపీఎల్‌ సీజన్ రెడీ అవుతుంది. అయితే, ఇప్పటికే ప్లేయర్ల ట్రేడింగ్​తో ఐపీఎల్ పండుగకు అంతా సిద్ధం అవ్వగా.. మరి కొద్ది రోజుల్లో మిని వేలం స్టార్ట్ కానుంది. డిసెంబర్‌ 19న దుబాయ్‌ లో ఈ మినీ వేలం జరగనుంది. సుమారు పది ప్రాంఛైజీలు ఈ మినీ వేలంలో పాల్గొననున్నాయి. 1166 మంది ఆటగాళ్లు తమ పేర్లను ఆ లిస్ట్​లో నమోదు చేసుకున్నారు. వారిలో 830 మంది భారతీయ క్రికెట‌ర్లు ఉండగా.. 212 మంది క్యాప్డ్, 909 మంది అన్‌క్యాప్డ్ ప్లేయ‌ర్లు ఉన్నారు. ఇక, 30 మంది విదేశీ ప్లేయర్లు సైతం ఉండ‌నున్నారు.

Read Also: Trisha Krishnan: చీరకట్టులో చిరునవ్వుతో మాయచేస్తున్న త్రిష కృష్ణన్

అయితే, మరోవైపు ఈ లిస్ట్​లో మ‌రింత మంది ఆటగాళ్లను చేర్చడంపై 10 ఫ్రాంచైజీల‌ను స్పందించాల్సిందిగా బీసీసీఐ కోరింది. ఇక, వ‌న్డే వరల్డ్ కప్ లో పరుగుల వరద పారించిన ట్రావిస్ హెడ్, ర‌చిన్ రవీంద్ర, మిచెల్ మార్ష్, ప్యాట్ క‌మిన్స్​ ఈ వేలం కోసం త‌మ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇక 77 మంది ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు ఈ సారి ఏకంగా 262.95 కోట్ల రూపాయలకు పైగా ఖ‌ర్చు చేసే అవకాశం ఉంది.

Read Also: Animal Collections: ఫస్ట్ డే దుమ్ములేపిన ‘యానిమల్’

ఇక, రచిన్‌ రవీంద్ర.. తన కనీస ధరను 50 లక్షల రూపాయలుగా నిర్ణయించగా.. దీని కన్నా 20 రెట్లు అధిక మొత్తానికి అతడు అమ్ముడుపోయే ఛాన్స్ ఉందని క్రీడా విశ్లేషకులు తెలియజేస్తున్నారు. అలాగే, ఆఫ్ఘనిస్థాన్ ప్లేయర్ అజ్మతుల్లా ఒమ‌ర్‌జాయ్‌ కు మంచి డిమాండ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక, ఆస్ట్రేలియా వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌డంలో కీల‌క పాత్ర పోషించిన ప్యాట్ క‌మిన్స్, ట్రావిస్ హెడ్, మిచెల్ స్టార్క్‌ల‌కు 2 కోట్ల రూపాయల క‌నీస ధ‌రను నిర్ణయించారు. అయితే, గతంలో జరిగిన మినీ వేలంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండ‌ర్ సామ్ క‌ర‌న్ రికార్డు స్థాయిలో ధ‌ర ప‌లికాడు.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో అలరించిన అత‌డ్ని పంజాబ్ కింగ్స్ ఏకంగా 18.50 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది. ఐపీఎల్ చ‌రిత్రలో ఒక ప్లేయ‌ర్‌కు అంత ధ‌ర పెట్టి కొనడం కూడా ఓ రికార్డే.

Show comments