NTV Telugu Site icon

IPL Final: ఐపీఎల్ ఫైనల్లో సీఎస్కే Vs గుజరాత్.. ట్రోఫీ విజేత ఎవరో..!

Ipl Final

Ipl Final

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్ 16లో భాగంగా రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను అలరించి చివరి దశకు చేరుకుంది. ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్, చైన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో సీజన్‌లో కూడా ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. ఆదివారం సాయంత్రం 7: 30గంటలకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ ఫైనల్ పోరు జరుగనుంది.

Also Read : WTC FINAL : ఐపీఎల్ లో మెరిసిన ప్లేయర్స్.. ఓవల్ లో ఏం చేస్తారో మరీ..!

ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ చరిత్రలోనే 10 సార్లు ఫైనల్ కు చేరింది. ఐపీఎల్‌లో 61.28 శాతం సీఎస్కే అత్యధిక విజయాల రికార్డును కలిగి ఉంది. ఈ సీజన్లో గుజరాత్ నెంబర్ 2 జట్టుగా ఉండటమే కాకుండా నంబర్ 1 జట్టుగా ఫ్లే ఆఫ్స్‌లోకి అడుగుపెట్టింది. శుక్రవారం రాత్రి జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచులో ముంబై ఇండియన్స్‌ను గుజరాత్ టైటాన్స్ చిత్తుగా ఓడించింది. 61 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Also Read : Manipur Violence: మణిపూర్లో సైన్యం ‘ఆపరేషన్ వెపన్ రికవరీ’

చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ఓడిపోయింది. తొలి క్వాలిఫయర్ మ్యాచులో చైన్నై 172 పరుగులు చేయగా.. హార్ధిక్ పాండ్యా సేన 157 పరుగులే చేసి ఓటమిపాలైంది. ధోనీ సారథ్యంలోని సీఎస్కే ఐదోసారి ఛాంపియన్ గా నిలుస్తుందా..? లేక గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండోసారి ఛాంపియన్ అవుతుందా..? అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

Also Read : Fake doctors: కడుపునొప్పని ఆస్పత్రికి పోతే.. మహిళ కిడ్నీలు, గర్భాశయాన్ని మాయం చేసిన డాక్టర్లు

అటు గుజరాత్ టైటాన్స్ టీమ్ లో అద్భుతమైన బ్యాటింగ్ తో శుభ్‌మాన్ గిల్ ఈ సీజన్లో మూడు సెంచరీలు చేసి భీకర ఫామ్‌లో ఉన్నాడు. తొలి క్వాలిఫయర్‌లో చైన్నై చేతిలో దెబ్బతిన్న గుజరాత్.. చైన్నైని ఓడించాలని గట్టి పట్టుదలతో ఉండగా.. మరో వైపు సీఎస్కే ఓపెనర్స్ రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వేలు అసాధారణమైన బ్యాటింగ్ తో పాటు మంచి ఓపెనింగ్ భాగస్వామ్యాలను సాధించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ రెండు జట్లు ఫైనల్ టైటిల్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి.