NTV Telugu Site icon

KL Rahul-LSG: అందుకే ఎల్‌ఎస్‌జీ నుంచి బయటికి వచ్చా: కేఎల్ రాహుల్‌

Kl Rahul Lsg

Kl Rahul Lsg

ఐపీఎల్‌ 2025 మెగా వేలం నవంబర్‌ 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనుంది. ఐపీఎల్‌ మెగా వేలంకు ముందు ప్రాంఛైజీలు తమ రిటైన్ లిస్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) ఫ్రాంచైజీ నుంచి టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ బయటికొచ్చేశాడు. రాహుల్‌ను రిటైన్‌ చేసుకోవడానికి ఎల్‌ఎస్‌జీ ఆసక్తి చూపినా.. అతడు అందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. గత సీజన్‌లో ఎల్‌ఎస్‌జీ ఓనర్ సంజీవ్‌ గోయెంకా మైదనంలోనే ఆగ్రహం వ్యక్తం చేయడంతో రాహుల్‌ ఆ ఫ్రాంఛైజీకి దూరం కావాలని నిర్ణయించుకున్నాడట.

ఇటీవల స్టార్‌స్పోర్ట్స్‌కు కేఎల్ రాహుల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల కాగా.. ఎల్‌ఎస్‌జీని వీడటానికి గల కారణాలను అతడు వెల్లడించాడు. తన ప్రయాణంను కొత్తగా ప్రారంభించాలనుకుంటున్నానని, తనదైన ఆట ఆడేందుకు స్వేచ్ఛ అవసరం ఎల్‌ఎస్‌జీ నుంచి బయటికి వచ్చానని చెప్పాడు. ‘ఐపీఎల్‌ను కొత్తగా ప్రారంభించాలనుకుంటున్నా. నా ఆట ఆడేందుకు స్వేచ్ఛ అవసరం కాబట్టి ఎల్‌ఎస్‌జీ నుంచి బయటికి వచ్చా. జట్టు వాతావరణం తేలికగా ఉండి.. స్వేచ్ఛ లభించే జట్టు తరఫున ఆడాలనుకుంటున్నా’ అని రాహుల్ పేర్కొన్నాడు.

ఐపీఎల్ మెగా వేలంలో కేఎల్ రాహుల్‌కు భారీ ధర పలికే అవకాశం ఉంది. కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం ఉండటం, వికెట్‌ కీపర్‌ కమ్ బ్యాటర్ కావడంతో ఫ్రాంఛైజీలు రాహుల్‌ కోసం తీవ్రంగా పోటీపడే అవకాశముంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాహుల్‌ కోసం భారీ మొత్తం వెచ్చించేందుకు సిద్ధమైందట. పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.