KL Rahul-LSG: అందుకే ఎల్ఎస్జీ నుంచి బయటికి వచ్చా: కేఎల్ రాహుల్
- జెడ్డాలో ఐపీఎల్ 2025 మెగా వేలం
- స్టార్‌స్పోర్ట్స్‌కు కేఎల్ రాహుల్ ఇంటర్వ్యూ
- రాహుల్‌కు భారీ ధర పలికే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబర్ 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనుంది. ఐపీఎల్ మెగా వేలంకు ముందు ప్రాంఛైజీలు తమ రిటైన్ లిస్టును ప్రకటించిన విషయం తెలిసిందే. లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) ఫ్రాంచైజీ నుంచి టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ బయటికొచ్చేశాడు. రాహుల్‌ను రిటైన్ చేసుకోవడానికి ఎల్ఎస్జీ ఆసక్తి చూపినా.. అతడు అందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. గత సీజన్లో ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్ గోయెంకా మైదనంలోనే ఆగ్రహం వ్యక్తం చేయడంతో రాహుల్ ఆ ఫ్రాంఛైజీకి దూరం కావాలని నిర్ణయించుకున్నాడట.
ఇటీవల స్టార్‌స్పోర్ట్స్‌కు కేఎల్ రాహుల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల కాగా.. ఎల్ఎస్జీని వీడటానికి గల కారణాలను అతడు వెల్లడించాడు. తన ప్రయాణంను కొత్తగా ప్రారంభించాలనుకుంటున్నానని, తనదైన ఆట ఆడేందుకు స్వేచ్ఛ అవసరం ఎల్ఎస్జీ నుంచి బయటికి వచ్చానని చెప్పాడు. ‘ఐపీఎల్‌ను కొత్తగా ప్రారంభించాలనుకుంటున్నా. నా ఆట ఆడేందుకు స్వేచ్ఛ అవసరం కాబట్టి ఎల్ఎస్జీ నుంచి బయటికి వచ్చా. జట్టు వాతావరణం తేలికగా ఉండి.. స్వేచ్ఛ లభించే జట్టు తరఫున ఆడాలనుకుంటున్నా’ అని రాహుల్ పేర్కొన్నాడు.
Also Read
- Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
- Pakistan: పిల్లలపై అత్యాచారం, ట్రాఫికింగ్ నిందితుడు.. PoK ఎన్నికల్లో గెలుపు..
- Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
- Agni-4 Ballistic Missile: పాకిస్తాన్ మొత్తం భారత పరిధిలో.. అగ్ని-4 మిస్సైల్ సక్సెస్..
ఐపీఎల్ మెగా వేలంలో కేఎల్ రాహుల్‌కు భారీ ధర పలికే అవకాశం ఉంది. కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం ఉండటం, వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ కావడంతో ఫ్రాంఛైజీలు రాహుల్ కోసం తీవ్రంగా పోటీపడే అవకాశముంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాహుల్ కోసం భారీ మొత్తం వెచ్చించేందుకు సిద్ధమైందట. పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
-
Pakistan: పిల్లలపై అత్యాచారం, ట్రాఫికింగ్ నిందితుడు.. PoK ఎన్నికల్లో గెలుపు..
-
Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
-
Agni-4 Ballistic Missile: పాకిస్తాన్ మొత్తం భారత పరిధిలో.. అగ్ని-4 మిస్సైల్ సక్సెస్..
-
Forbes Best Under a Billion 2026: చైనాకు ఒక్క అడుగు దూరంలో భారత్.. ఫోర్బ్స్ జాబితాలో టాప్-200లో 27 సంస్థలు
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!