IPL 2026 Trade List: ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు ఫ్రాంచైజీల మధ్య జరిగిన ప్లేయర్స్ ట్రేడింగ్ పూర్తిగా రసవత్తరంగా సాగింది. బీసీసీఐ ప్రకటించిన ఈ లిస్ట్‌లో కొన్ని భారీగా, కొన్ని అనూహ్య మార్పులు చోటు చేసుకోవడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ అతని పాత ధర రూ. 18 కోట్లకే ట్రేడ్ చేసుకోవడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అదే సమయంలో సీఎస్‌కే జట్టులోని వెటరన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, సామ్ కరణ్‌లను రాజస్థాన్ రాయల్స్ తమ జట్టులోకి చేర్చుకుంది. జడేజాపై రాజస్థాన్ రాయల్స్ రూ. 14 కోట్ల క్యాష్ డీల్ చేసిన కారణంగా అతని గత ధరతో పోలిస్తే రూ. 4 కోట్లు తగ్గింది. మరోవైపు సామ్ కరణ్‌ను అతని పాత ధర రూ. 2.4 కోట్లకే తీసుకున్నారు.
Oats Side Effects: రోజు టిఫిన్ లో ఓట్స్ తీసుకుంటున్నారా.. అయితే బీకేర్ ఫుల్…..
ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన స్టార్ పేసర్ మహమ్మద్ షమీని అతని పాత ధర రూ. 10 కోట్లకే లక్నో సూపర్ జెయింట్స్ తమ జట్టులో చేర్చుకుంది. అలాగే కేకేఆర్ లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండేను రూ. 30 లక్షలకే ముంబై ఇండియన్స్ తిరిగి సొంతం చేసుకుంది. సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌ను ముంబై నుంచి లక్నో రూ. 30 లక్షలకే ట్రేడ్ చేసుకోవడం కూడా అనూహ్య మార్పుగా నిలిచింది. రాజస్థాన్ రాయల్స్ నుంచి నితీష్ రాణా ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారగా, ఢిల్లీ జట్టులోని ఆల్‌రౌండర్ డోనోవన్ ఫెర్రీరాను రాజస్థాన్ రాయల్స్ రూ. 1 కోటి డీల్‌తో తీసుకుంది. ఈ డీల్‌లో ఫెర్రీరా ధర రూ. 25 లక్షలు పెరిగింది. ఇక ఇప్పటికే ప్రకటించిన శార్దూల్ ఠాకూర్, షెర్ఫెన్ రూథర్‌ఫోర్డ్‌లను ముంబై ఇండియన్స్ ట్రేడ్ చేసుకుంది.
