Site icon NTV Telugu

IPL 2026-CSK: ఐపీఎల్ 2026 వేలంకు ముందే సంచ‌ల‌నం.. సీఎస్‌కేలోకి సంజు, జడేజా ఔట్!

Ravindra Jadeja Sanju Samson

Ravindra Jadeja Sanju Samson

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలం కోసం నవంబర్ 15 లోపు రిటైన్ లిస్ట్ ప్రకటించాలని 10 ఫ్రాంచైజీలకు భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రిలీజ్ లిస్టుపై ఫ్రాంచైజీలు దృష్టి సారించాయి. తుది గడువుకు ఇంకా నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఫ్రాంచైజీలు రిలీజ్ చేసే ప్లేయర్స్ వీరే అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)కు సంబంధించి ఓ బిగ్ న్యూస్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. అదే సంజు శాంసన్ ట్రేడ్ ప్రక్రియ.

క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం… సంజు శాంసన్ ట్రేడ్ ప్రక్రియ దాదాపుగా పూర్తయిందని తెలుస్తోంది. సీఎస్‌కేలోకి సంజు ట్రేడ్ ద్వారా వస్తున్నాడట. ఈ ఒప్పందం చివరి దశలో ఉందట. చెన్నై ఫ్రాంచైజీ నుంచి అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. స్టార్ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా లేదా బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్‌లలో ఒకరు సంజు స్థానంలో రాజస్థాన్ రాయల్స్‌కు వెళ్తున్నారని కూడా క్రిక్‌బజ్ నివేదించింది. చెన్నై, రాజస్థాన్ మధ్య ఈ ట్రేడ్ జరిగితే.. ఐపీఎల్ చరిత్రలో రికార్డు ఒప్పందంగా మారనుంది. గతంలో సంజును ట్రిస్టన్ స్టబ్స్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌కు ట్రేడ్ చేస్తారని న్యూస్ చక్కర్లు కొట్టాయి. కానీ ఇప్పుడు చెన్నై సంజు ఒప్పందాన్ని దాదాపుగా పూర్తి చేసిందట.

44 ఏళ్ల వెటరన్ క్రికెటర్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్ కెరీర్ చివరి దశలో ఉంది. ఇటీవల సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథ్ ఐపీఎల్ 2026లో ధోనీ ఆడతాడని ప్రకటించారు. అయితే వచ్చే సీజన్‌లో మహీ ఎన్ని మ్యాచ్‌లు ఆడుతాడనేది అతని ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుంది. ఫిట్‌నెస్ ఉన్నంతవరకు చెన్నై తరపున ఆడతానని ధోనీ చాలాసార్లు చెప్పారు. ఈ పరిస్థితిలో సంజు శాంసన్ చెన్నైచేరితే.. మహీ వికెట్ కీపింగ్ వారసత్వాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. ధోనీ నిష్క్రమణ తర్వాత చెన్నైకి ఆ స్థాయిలో కీపర్ లేడు. కాబట్టి సంజు మంచి ఎంపిక అనే చెప్పాలి. సంజు అద్భుతమైన వికెట్ కీపర్ మాత్రమే కాదు.. మంచి బ్యాటర్ కూడా. సంజుకి అద్భుతమైన ఐపీఎల్ రికార్డు ఉంది.

Also Read: మైండ్ బ్లాకింగ్ ఫీచర్లు, సూపర్ డిజైన్.. ఊహించని అప్‌గ్రేడ్‌తో రానున్న iPhone 18 Pro!

రవీంద్ర జడేజాను చెన్నై బదిలీ చేస్తే.. అతను రాజస్థాన్ రాయల్స్‌కు తిరిగి వెళ్తాడు. జడేజా 2008లో రాజస్థాన్ రాయల్స్‌తో తన ఐపీఎల్ కెరీర్‌ను ప్రారంభించాడు. మొదటి సీజన్లో షేన్ వార్న్ కెప్టెన్సీలో ఆడాడు. అప్పుడు రాజస్థాన్ టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తరువాత జడేజా రాజస్థాన్ రాయల్స్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కు మారాడు. ఇన్నేళ్ళుగా చెన్నైలోనే ఉన్నాడు. సంజు శాంసన్ మాత్రం ఐపీఎల్‌లో మొదటిసారి (ట్రేడ్ ఒకే అయితే) చెన్నై తరఫున ఆడనున్నాడు.

Exit mobile version