Site icon NTV Telugu

RCB Vs SRH: టాస్ గెలిచిన ఆర్సీబీ.. బ్యాటింగ్ ఎవరిదంటే..

Srh Vs Rcb

Srh Vs Rcb

ఐపీఎల్ 2026 సీజన్ గ్రాండ్ ఓపెనింగ్‌కు సమయం ఆసన్నమైంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ తొలి పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తో తలపడుతున్న ఈ మ్యాచ్‌లో ఇప్పుడే టాస్ పడింది. ఆర్సీబీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదటగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ సీజన్ 2026లో మొదట బ్యాటింగ్ చేయనుంది. దీంతో ఆరెంజ్ ఆర్మీ అభిమానుల్లో 300 స్కోర్ లోడింగ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ఈ మ్యాచ్‌పై గత ఏడాది టైటిల్ వేడుకల సమయంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయిన విషాద ఛాయలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. రెండు జట్లు కూడా బౌలింగ్ విభాగంలో సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఆర్సీబీ విషయానికి వస్తే.. స్టార్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ ఇంకా కోలుకోకపోవడం, యశ్ దయాళ్ ఈ సీజన్ మొత్తానికి దూరం కావడం జట్టుకు పెద్ద లోటు. ఇప్పుడు సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తో పాటు కృనాల్ పాండ్యా, సుయాష్ శర్మ, మంగేష్ యాదవ్‌లపైనే భారమంతా ఉంది.

సన్‌రైజర్స్: రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో ఇషాన్ కిషన్ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. జయదేవ్ ఉనద్కత్, హర్షల్ పటేల్ వంటి బౌలర్లు బ్యాటింగ్‌కు అనుకూలించే ఈ పిచ్‌పై ఎంతవరకు రాణిస్తారో చూడాలి.

బ్యాటింగ్ ధమాకా..
బౌలింగ్ బలహీనంగా ఉండటంతో ఈ మ్యాచ్ పూర్తిగా బ్యాటర్ల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది.

RCB బ్యాటర్లు.. విరాట్ కోహ్లీ, టిమ్ డేవిడ్, ఫిల్ సాల్ట్, రజత్ పాటిదార్, జాకబ్ బెథెల్ మరియు రొమారియో షెపర్డ్ వంటి విధ్వంసకర ఆటగాళ్లతో ఆర్సీబీ బలంగా ఉంది.

SRH బ్యాటర్లు: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ మరియు హెన్రిచ్ క్లాసెన్ వంటి హిట్టర్లతో సన్‌రైజర్స్ కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది.

Exit mobile version