ఐపీఎల్ 2026 క్రికెట్ లవర్స్ కు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ అందిస్తోంది. తమ ఫేవరెట్ టీమ్స్ కు, ప్లేయర్స్ కు సపోర్ట్ చేస్తూ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు జోష్ రెట్టింపు కానుంది. టాటా ఐపీఎల్-2026 మ్యాచ్‌లు ఏప్రిల్ 5 నుంచి మే 22 వరకు ఉప్పల్‌లో జరుగునున్నాయి. మ్యాచులు అంతరాయాలు లేకుండా సజావుగా నిర్వహించేందుకు సుమారు 2000 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. మ్యాచ్ రోజులలో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, టీఎస్ఎస్పీ, ఆర్మ్డ్ రిజర్వ్, బాంబ్ డిస్పోజల్ టీమ్ తదితర విభాగాలు సమన్వయంతో పనిచేస్తాయని అధికారులు తెలిపారు.
Also Read:Polavaram Project: తక్కువ సమయంలోనే డయాఫ్రం వాల్ నిర్మాణం.. ఇరిగేషన్ శాఖ, ఇంజనీర్లకు అభినందనలు..
స్టేడియం పరిసర ప్రాంతాల్లో మొత్తం 430 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ నిర్వహిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా స్నిఫర్ డాగ్స్, యాంటీ సబోటేజ్ చెక్స్ కూడా నిరంతరం కొనసాగుతాయి. ప్రేక్షకుల భద్రత దృష్ట్యా మద్యం, గాజు సీసాలు, కత్తులు, లైటర్లు, లేజర్ పాయింటర్లు, బ్యాగులు వంటి నిషేధిత వస్తువులను స్టేడియంలోకి అనుమతి లేదని తెలిపారు. ప్రతి గేట్ వద్ద స్కానింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయడంతో పాటు, అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు.
Also Read:Chiranjeevi: అయోధ్య ‘సూర్య తిలకం’ లాగే చిరంజీవి ఇంట్లో అద్భుతం.. వీడియో వైరల్!
గేట్ నంబర్ 1ను కేవలం ఆటగాళ్లకే కేటాయించామని పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ రద్దీ నివారణకు ప్రత్యేక డైవర్షన్లు అమలు చేస్తూ, భారీ వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాలు సూచించారు. స్టేడియం వద్ద రెండు చక్రాల, నాలుగు చక్రాల వాహనాలకు వేర్వేరు పార్కింగ్ ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రేక్షకులు వ్యక్తిగత వాహనాలకంటే RTC బస్సులు, మెట్రో సేవలను వినియోగించాలని పోలీసులు వినతి
మ్యాచ్‌కు మూడు గంటల ముందు నుంచే ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతిస్తామని తెలిపారు. మొత్తంగా, ప్రేక్షకుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, మ్యాచ్‌లు సాఫీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
