IPL 2026 Final: ఫైనల్ కు వర్షం గండం.. మరి రిజర్వ్ డే సంగతేంటి.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2026 Final: ఐపీఎల్ 2026 సీజన్ చివరి మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ ఫైనల్ మే 31న జరగనుంది. ఈసారి టైటిల్ కోసం డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు తలపడనున్నాయి. అయితే అహమ్మదాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌కు ముందు వర్షం భయం అభిమానుల్లో కాస్త టెన్షన్ గా మారింది.
ఈ సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగి అద్భుత ప్రదర్శనతో ఆర్సీబీ ఫైనల్‌కు దూసుకొచ్చింది. క్వాలిఫైయర్-1లో గుజరాత్ టైటాన్స్‌పై భారీ విజయాన్ని నమోదు చేసి నేరుగా ఫైనల్ బెర్త్ కైవసం చేసుకుంది. మరోవైపు క్వాలిఫైయర్-2లో గుజరాత్ అద్భుత కంబ్యాక్ ఇచ్చి మరోసారి టైటిల్ రేసులో నిలిచింది. దీంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇరు జట్లలో ఎవరు గెలిచినా ట్రోఫీని రెండోసారి ముద్దాడుతుంది.
Also Read
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
- OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
- Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
అయితే ఫైనల్ మ్యాచ్ జరిగే అహ్మదాబాద్‌లో వాతావరణ పరిస్థితులు ఇప్పుడు హాట్ టాపిక్‌గా కీలకంగా మారింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం గుజరాత్లో మే 30 నుంచి జూన్ 2 వరకు ప్రీ-మాన్సూన్ వర్షాలు కురిసే అవకాశముంది. ముఖ్యంగా అహ్మదాబాద్ సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో అభిమానుల్లో ఫైనల్ మ్యాచ్‌కు వర్షం అడ్డుపడితే విజేతను ఎలా నిర్ణయిస్తాని.
అయితే ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఫైనల్ మ్యాచ్ కోసం ప్రత్యేకంగా రిజర్వ్ డే ఏర్పాటు చేశారు. మే 31న మ్యాచ్ పూర్తిగా జరగకపోయినా లేదా మధ్యలో ఆగిపోయినా, మరుసటి రోజు జూన్ 1న మ్యాచ్ ను కొనసాగిస్తారు. ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే ఆట మొదలవుతుంది. రిజర్వ్ డే రోజున కూడా వర్షం ప్రభావం ఉంటే అంపైర్లు ఓవర్ల సంఖ్యను తగ్గించే అవకాశం ఉంటుంది. మ్యాచ్ ఫలితం రావాలంటే రెండు జట్లూ కనీసం 5 ఓవర్లు ఆడాలి. అలాంటి పరిస్థితుల్లో డక్‌వర్త్ లూయిస్ స్టెర్న్ (DLS) విధానం ద్వారా ఫలితాన్ని నిర్ణయిస్తారు. అయితే రెండు రోజులు కూడా పూర్తిగా వర్షం కారణంగా మ్యాచ్ జరగకపోతే మరో కీలక నిబంధన అమల్లోకి వస్తుంది. ట్రోఫీని రెండు జట్లకు పంచడం కాకుండా.. లీగ్ స్టేజ్ ముగిసే సమయానికి పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న జట్టునే ఛాంపియన్‌గా ప్రకటిస్తారు. ఈ రూల్ వర్తిస్తే RCB మరోసారి ఛాంపియన్ గా నిలుస్తుంది.
ఈ సీజన్ లీగ్ దశ ముగిసే సమయానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మెరుగైన నెట్ రన్‌రేట్‌తో అగ్రస్థానంలో నిలిచింది. కాబట్టి ఫైనల్ పూర్తిగా రద్దైతే ఐపీఎల్ 2026 టైటిల్ ఆర్సీబీకే దక్కుతుంది. ఇదిలా ఉంటే అభిమానులకు మరో ఊరటనిచ్చే విషయం కూడా ఉంది. తాజా వాతావరణ అంచనాల ప్రకారం మే 31 సాయంత్రం అహ్మదాబాద్‌లో భారీ వర్ష సూచనలు లేవు. ఆకాశంలో మేఘాలు తక్కువగానే ఉండే అవకాశం ఉందని, వర్షం పడే అవకాశాలు కూడా చాలా స్వల్పమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీంతో ఫైనల్ మ్యాచ్ ఎలాంటి ఆటంకం లేకుండా సజావుగా జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
-
OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!