IPL 2025 Winner: అందరి అంచనాలు ఆ టీం వైపే.. చివరికి AI కూడా..!
- ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 గ్రాండ్ ఫైనల్ కు రంగం సిద్ధం.
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య ఉత్కంఠభరిత పోరు
- అందరి అంచనాలు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వైపే.
- చివరకు AI టూల్స్ కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరునే విజేతగా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2025 Winner: అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 గ్రాండ్ ఫైనల్ కు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య ఉత్కంఠభరిత పోరు జరగనుంది. ఈ రెండు జట్లు క్వాలిఫయర్-1లో ఇప్పటికే తలపడగా, ఆ మ్యాచ్ లో ఆర్టీసీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, పంజాబ్ కింగ్స్ ఆ పరాజయాన్ని తట్టుకుని క్వాలిఫయర్-2లో ఐదు సార్లు టైటిల్ గెలుచుకున్న ముంబయి ఇండియన్స్ పై గెలిచి ఫైనల్ కి చేరుకుంది. శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ బలంగా కనిపిస్తుండగా, రాజత్ పటీదార్ నేతృత్వంలోని బెంగళూరు జట్టు కూడా దూకుడుగా ఉంది.
ఇకపోతే, ఈ హై వోల్టేజ్ ఫైనల్ పై అభిమానుల అభిప్రాయాలు రెండు వైపులా ఉన్నప్పటికీ, ప్రస్తుతం ట్రేండింగ్ లో ఉన్న AI ప్లాట్ ఫార్ములు గ్రోక్ (Grok), జెమినీ (Gemini), చాట్ జిపిటి (ChatGPT) మూడు కూడా విజేతగా ఒకే జట్టునే చూపిస్తున్నాయి. మరి ఈ AI ప్లాట్ ఫార్ములు ఏ జట్టును ఎందుకు విజేతలుగా ఎంచుకుందో ఒకసారి చూద్దామా..
Also Read
- Vaibhav Sooryavanshi: భవిష్యత్ అంతా వైభవ్‌దే.. వరల్డ్ కప్‌లో సూర్యవంశీకి చోటు..
- RCB Vs GT: నిప్పలు చెరుగుతున్న బెంగళూరు బౌలర్లు.. పెవిలియన్‌కు చేరిన ఓపెనర్స్..
- RCB vs GT Final: గుజరాత్ బ్యాటింగ్.. బెంగళూరు బౌలింగ్.. గుజరాత్ టీంలో కీలక మార్పులు..
- West Bengal: మమతకు భారీ షాక్.. 80 మందిలో 20 మంది ఎమ్మెల్యేలే హాజరు!
Read Also: IPL 2025 Final: సాయంత్రం 6 గంటలకే ఐపీఎల్ ముగింపు వేడుకలు..
చాట్‌జిపిటి అంచనా:
ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ పై ఆర్సీబి విజయాలను పరిగణనలోకి తీసుకుని, ఫైనల్ విజయానికి బెంగళూరు బలంగా ఉందని తెలిపింది. అయితే శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ కూడా పటిష్టంగా ఉండటంతో ఈ ఫైనల్ పోరు చాలా కష్టం అని చెప్పింది. చివరికి మాత్రం ఆర్సీబి స్వల్ప తేడాతో గెలుస్తుందనే అభిప్రాయాన్ని చాట్‌జిపిటి తెలిపింది.
గ్రోక్ అంచనా:
గ్రోక్ అంచనా ప్రకారం.. ఆర్సీబి బౌలింగ్, బ్యాటింగ్ ఇలా అన్ని విభాగాల్లో దుమ్మురేపుతోందని గ్రోక్ అభిప్రాయపడింది. ముఖ్యంగా బౌలింగ్ డిపార్ట్మెంట్ లో జోష్ హేజిల్‌వుడ్ (11 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు), అలాగే మరో బౌలర్ సూయాష్ శర్మ బౌలింగ్ లో అద్భుతంగా రాణిస్తుండగా.. మరోవైపు విరాట్ కోహ్లీ 55.81 సగటుతో 614 పరుగులు చేయగా, మరో స్టార్ బాట్స్మెన్ ఫిల్ సాల్ట్ భీకర ఫామ్ లో ఉన్నారు.
Read Also: Deepika Padukone: ‘స్పిరిట్’ కోసం తగ్గని దీపిక.. అల్లు అర్జున్ కోసం ఎందుకు తగ్గింది?
జెమినీ అంచనా:
మరో AI జెమినీ అభిప్రాయం ప్రకారం.. రెండు జట్లు తమ తొలి టైటిల్ కోసం పోటీపడుతుండగా.. ఆర్సీబికి స్వల్ప ఆధిక్యత ఉన్నట్లు అంచనా వేసింది. కానీ, ఫైనల్ రోజున ఆటతీరు, టాస్, వాతావరణ పరిస్థితులు కూడా ఫలితాన్ని ప్రభావితం చేయవచ్చని తెలిపింది.
మొత్తంగా AI టూల్స్ కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరునే విజేతగా సూచించాయి. అయినా కూడా పంజాబ్ కింగ్స్ పుంజుకోవడం, శ్రేయాస్ అయ్యర్ అద్భుత నాయకత్వం మ్యాచ్‌ను ఊహించలేని మలుపులకు తీయవచ్చు. కాబట్టి అభిమానులకు ఈ ఫైనల్ మ్యాచ్ మైదానంలో యుద్ధంలా ఉండనుంది.
తాజావార్తలు
-
Viral News: 10 మంది అక్కాచెల్లెళ్ల పెళ్లిళ్ల కోసం తమ్ముడు ఏం చేశాడో తెలిస్తే సెల్యూట్ చేస్తారు..!
-
Vaibhav Sooryavanshi: భవిష్యత్ అంతా వైభవ్‌దే.. వరల్డ్ కప్‌లో సూర్యవంశీకి చోటు..
-
Indian Navy Recruitment 2026: భారత నావికాదళంలో బీటెక్ క్యాడెట్ ఎంట్రీకి దరఖాస్తులు.. అర్హత, ఎంపిక వివరాలు ఇవే
-
Gopichand 34 : పట్టాలెక్కిన గోపీచంద్ 34వ మూవీ… షూటింగ్ అప్డేట్
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
ట్రెండింగ్
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!