Site icon NTV Telugu

Shubman Gill: సిరాజ్‌ సూపర్.. బ్యాటర్ల కంటే బౌలర్లే గేమ్‌ ఛేంజర్లు!

Shubman Gill

Shubman Gill

ఉప్పల్ మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై నాలుగు వికెట్స్ పడగొట్టిన మహ్మద్ సిరాజ్‌పై గుజరాత్ టైటాన్స్‌ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రశంసలు కురిపించాడు. బౌలింగ్‌లో సిరాజ్‌ ఎనర్జీ సూపర్ అని, అద్భుతంగా బౌలింగ్ చేశాడని ప్రశంసించాడు. టీ20 ఫార్మాట్‌లో బ్యాటర్ల కంటే బౌలర్లే గేమ్‌ ఛేంజర్లు అని పేర్కొన్నాడు. వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా ఆడాడని గిల్ చెప్పుకొచ్చాడు. ఉప్పల్ మైదానంలో ఆదివారం రాత్రి హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో సిరాజ్ తన నాలుగు ఓవర్ల కోటాలో 17 రన్స్ ఇచ్చి నాలుగు వికెట్స్ తీశాడు.

Also Read: Mohammed Siraj: మనస్థాపానికి గురయ్యా.. జీర్ణించుకోలేకపోయా.. కష్టపడ్డా: సిరాజ్

మ్యాచ్ అనంతరం గుజరాత్ టైటాన్స్‌ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ… ‘టీ20 ఫార్మాట్‌లో బౌలర్లే గేమ్‌ ఛేంజర్లు. చాలా మంది బిగ్ హిటర్ల గురించి మాట్లాడుకుంటారు కానీ.. బౌలర్లు మ్యాచ్‌లను గెలిపిస్తారు. మేం మైదానం నలువైపులా షాట్లు ఆడాలనుకున్నాం. వాషింగ్టన్ సుందర్, నాకు మధ్య ఇదే సంభాషణ జరిగింది. ముంబైతో మ్యాచ్‌లో సుందర్ ఆడేందుకు సిద్ధమైనప్పటికీ ఇంపాక్ట్‌ రూల్‌తో మరొకరిని ఆడించాల్సి వచ్చింది. కొన్నిసార్లు ప్రణాళికలను మార్చుకోవాల్సి ఉంటుంది. ఈరోజు సుందర్ బ్యాటింగ్ అద్భుతంగా ఉంది. మేమిద్దరం కనీసం 30-40 పరుగుల భాగస్వామ్యం వచ్చాక మ్యాచ్‌ మాదేనని భావించాం. బౌలింగ్, ఫీల్డింగ్ సమయంలో మహ్మద్ సిరాజ్‌ ఎనర్జీ సూపర్’ అని తెలిపాడు.

Exit mobile version