Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ipl Ipl 2025 Shreyas Iyer Guide Yuzvendra Chahal In Pbks Vs Kkr

Shreyas Iyer-Chahal: చహల్‌కు శ్రేయస్‌ దిశానిర్దేశం.. ఏం చెప్పాడంటే?

Published Date :April 16, 2025 , 1:41 pm
By Sampath Kumar
  • పంజాబ్‌ విజయంలో చహల్‌ కీలక పాత్ర
  • 28 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టిన యూజీ
  • చహల్‌కు శ్రేయస్‌ దిశానిర్దేశం
Shreyas Iyer-Chahal: చహల్‌కు శ్రేయస్‌ దిశానిర్దేశం.. ఏం చెప్పాడంటే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ (పీబీకేఎస్) సంచలన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసి 111 పరుగులే చేసినా.. కోల్‌కతాను 95కే ఆలౌట్ చేసి 16 రన్స్ తేడాతో అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. పంజాబ్‌ విజయంలో టీమిండియా మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌ కీలక పాత్ర పోషించాడు. చహల్‌ తన స్పిన్‌ మాయాజాలంతో కేవలం 28 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అద్భుతంగా బౌలింగ్ చేసిన యూజీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ విజయం అనంతరం పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

తాను బ్యాటింగ్‌కు వచ్చిన సమయంలో బాల్‌ కాస్త టర్న్‌ అవడాన్ని గమనించా అని, యుజ్వేంద్ర చహల్‌ను శ్వాస మీద కాస్త నియంత్రణ సాధించు అని చెప్పానని శ్రేయస్ అయ్యర్ చెప్పాడు. ‘నేను బ్యాటింగ్‌కు వచ్చిన సమయంలో బంతి కాస్త టర్న్‌ అవుతోంది. మేము ఫీల్డింగ్ చేసేటప్పుడు నేను చహల్‌ను శ్వాస మీద నియంత్రణ సాధించు, కాస్త కూల్‌గా ఉండని చెప్పా. కచ్చితత్వంతో బంతు లేసి కేకేఆర్ బ్యాటర్లను అటాక్‌ చేయాలని సూచించా. చహల్‌ బంతిని తిప్పాడో మాకు విజయంపై విశ్వాసం కలిగింది. అదే సమయంలో నేను అటాకింగ్‌ ఫీల్డ్‌ సెట్‌ చేశా. బ్యాటర్లకు దగ్గరగా ఫీల్డర్లను మోహరించడంతో ఒత్తిడిలో తప్పులు చేసి వికెట్ ఇచ్చారు’ అని శ్రేయస్ తెలిపాడు.

‘నేను బ్యాటింగ్‌కు వెళ్లినప్పుడు బంతి విభిన్నంగా స్పందించింది. ఓ బాల్‌ ఎక్కువ బౌన్స్‌ రావడం, మరో బంతి నా బ్యాట్‌ కిందకు వచ్చింది. నేను మాత్రమే కాదు మిగతా బ్యాటర్లు కూడా స్వీప్‌ షాట్‌ ఆడటానికి ఇబ్బంది పడ్డారు. నిపిచ్‌ పరిస్థితులను బట్టి చూస్తే మేం చెప్పుకోదగ్గ స్కోరే చేశాం. పిచ్‌పై బంతి ఒక్కోసారి ఒక్కోలా వస్తోందని మా బౌలర్లకు వివరించా. వారు అద్భుత బంతులు వేశారు. రెండు ఓవర్లలో రెండు వికెట్లు పడగానే విజయంపై ఆశలు రేకెత్తాయి. చహల్‌ రాకతో మరింత విశ్వాసం కలిగింది. ప్రతి ఒక్కరు బాగా ఆడారు. ఈ విజయంతో మేం పొంగిపోం. ఈ గెలుపు మాలో మరింత బాధ్యతను పెంచింది. ఇదే స్ఫూర్తితో తర్వాతి మ్యాచ్‌లోనూ విజయం సాధిస్తాం’ అని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • IPL 2025
  • PBKS vs KKR
  • Shreyas Iyer
  • Yuzvendra Chahal

తాజావార్తలు

  • Good Friday: ఏసుక్రీస్తుకు శిలువ వేసిన రోజు.. గుడ్ ఫ్రైడే ఎందుకు ‘‘గుడ్’’..

  • Gold and Silver Prices Drop: బంగారం, వెండి ధరల పతనం వెనుక డొనాల్డ్‌ ట్రంప్‌..!

  • Wired Earphones: ఓల్డ్ ఈజ్ గోల్డ్.. మళ్లీ వైర్డ్ ఇయర్ ఫోన్స్‌కు పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే..

  • Artemis II: చంద్రుని అదృశ్య భాగాన్ని తొలిసారిగా చూడనున్న నలుగురు వ్యోమగాములు.. అపోలో 17 తర్వాత తొలి మానవసహిత యాత్ర

  • Vastu Tips: వేసవిలో మట్టి కుండ తీసుకున్నారా..? మీ అదృష్టం మారలంటే ఇంట్లో ఈ దిశలో పెట్టండి..!

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions