Site icon NTV Telugu

Rohit Sharma: నా దగ్గర బ్యాట్‌లు లేవు.. ఆరు దొబ్బేశారు! వీడియో వైరల్

Rohit Sharma 6 Bats

Rohit Sharma 6 Bats

ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 2లో పంజాబ్ కింగ్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన క్వాలిఫయర్ 2లో ఓడిన ముంబై.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 203 రన్స్ చేసింది. సూర్యకుమార్ యాదవ్ (44), తిలక్ వర్మ (44)లు రాణించారు. పంజాబ్ 19 ఓవర్లలో 207 పరుగులు చేసి విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్‌ (87), నెహాల్ వధేరా (48)లు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

క్వాలిఫయర్ 2 మ్యాచ్ అనంతరం మైదానంలో ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ కాస్త భావోద్వేగానికి గురయ్యారు. ఆపై డ్రెసింగ్ రూంలో కొన్ని కామెడీ సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ముంబై ప్లేయర్స్ చాలామంది తమ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ చుట్టూ చేరి ఆటోగ్రాఫ్‌లు అడిగారు. అందరికీ రోహిత్ టీషర్ట్, బ్యాట్‌లపై ఆటోగ్రాఫ్‌లు ఇచ్చాడు. స్పిన్నర్ కర్ణ్ శర్మ కూడా ఆటోగ్రాఫ్‌ తీసుకున్నాడు. ఆ సమయంలో తనకు ఓ బ్యాట్ ఇవ్వాలని హిట్‌మ్యాన్‌ను కర్ణ్ అడిగాడు. అందుకు రోహిత్ బదులిస్తూ.. ‘నా దగ్గర బ్యాట్స్ లేవు. ఇప్పటికే ఆరు బ్యాట్‌లు తీసుకున్నారు. బ్యాగ్ ఖాలీ అయిపోయింది చూడు’ అని అన్నాడు. రోహిత్ సమాధానంతో కర్ణ్ కాస్త నిరాశ చెందాడు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది.

Also Read: Virat Kohli: మూడు ఫైనల్స్‌ ఆడిన ఆర్సీబీ.. విరాట్‌ కోహ్లీ ఎన్ని రన్స్ చేశాడో తెలుసా?

రోహిత్ శర్మ కిట్ బ్యాగ్‌లో మొత్తం 9 బ్యాట్‌లు ఉండగా.. ముంబై ప్లేయర్స్ 6 తీసుకున్నారు. ఇక బ్యాగ్‌లో మూడే బ్యాట్‌లు ఉన్నాయి. రాబిన్ మింజ్, అశ్వని కుమార్, జానీ బెయిర్‌స్టో, కృష్ణన్ శ్రీజిత్ సహా మరో ఇద్దరు హిట్‌మ్యాన్‌ బ్యాట్‌లను తీసుకున్నారు. ఇక ఈ సీజన్లో రోహిత్ శర్మ పెద్దగా ప్రభావం చూపలేదు. 46.9 సగటు,152.2 స్ట్రైక్ రేట్‌తో 328 పరుగులు చేశాడు. చాలా మ్యాచులలో ఇంపాక్ట్ సబ్‌గా బరిలోకి దిగాడు.

Exit mobile version