Site icon NTV Telugu

IPL 2025 Suspended: క్రికెట్ ప్రియులకు షాక్.. ఐపీఎల్‌ నిరవధిక వాయిదా..

Ipl 2025

Ipl 2025

IPL 2025 Suspended : దేశంలో నెలకొన్న భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి  (బీసీసీఐ) నిరవధికంగా వాయిదా వేసింది. ఆటగాళ్ల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్ , పాకిస్తాన్ మధ్య సరిహద్దుల్లో గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఆటగాళ్లు , సహాయక సిబ్బంది ప్రయాణించడం, బయో-బబుల్ వాతావరణంలో ఉన్నప్పటికీ భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న బీసీసీఐ, ఆటగాళ్ల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఐపీఎల్ 2025 సీజన్‌ను నిరవధికంగా వాయిదా వేయడమే ఉత్తమమని భావించింది.

VC Sajjanar : సరిహద్దుల్లో ఉద్రిక్తత.. కొత్త దందాకు తెరలేపిన సైబర్ నేరగాళ్లు

అయితే.. ఇప్పటి వరకు ఐపీఎల్ 2025 సీజన్‌లో ధర్మశాలలో రద్దు చేసిన మ్యాచ్‌తో సహా 58 ఆటల నిర్వహించారు. అయితే.. ఈ గ్రూప్ దశలో ఆడటానికి ఇంకా 12 ఆటలు మిగిలి ఉన్నాయి, లక్నో (2), హైదరాబాద్, అహ్మదాబాద్ (3), ఢిల్లీ, చెన్నై, బెంగళూరు (2), ముంబై, జైపూర్, ఆ తర్వాత ప్లేఆఫ్‌లు, హైదరాబాద్, కోల్‌కతాలో నిర్వహించాల్సి ఉండేవి. అయితే.. ఈ నిర్ణయంతో ఆ మ్యాచ్‌లు అన్నీ నిరవధికంగా వాయిదా పడ్డాయి.

India Pakistan War: బ్లాక్‌ అవుట్‌ అంటే ఏంటి..? అసలు ఎందుకు అమలు చేస్తారు..?

Exit mobile version