Site icon NTV Telugu

IPL 2025 Playoffs: ఐపీఎల్‌ 2025 ప్లేఆఫ్స్‌.. క్వాలిఫయర్‌, ఎలిమినేటర్‌లో తలపడే టీమ్స్ ఇవే!

Ipl 2025 Playoffs Teams

Ipl 2025 Playoffs Teams

ఐపీఎల్‌ 2025లో లీగ్‌ దశ పూర్తయింది. చివరి లీగ్‌ మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ను ఓడించింది. ముందుగా లక్నో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ (118 నాటౌట్‌; 61 బంతుల్లో 11×4, 8×6) సెంచరీ చేశాడు. లక్ష్యాన్ని ఆర్సీబీ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జితేశ్‌ శర్మ (85 నాటౌట్‌; 33 బంతుల్లో 8×4, 6×6) , విరాట్ కోహ్లీ (54; 30 బంతుల్లో 10×4)లు హాఫ్ సెంచరీలు బాదారు. అద్భుత విజయంతో పాయింట్ల పట్టికలో బెంగళూరు టాప్‌-2లోకి దూసుకెళ్లింది.

చివరి లీగ్‌ మ్యాచ్‌తో ఐపీఎల్‌ 2025 ప్లేఆఫ్స్‌ లెక్క తేలింది. పంజాబ్ కింగ్స్ 19 పాయింట్లతో పట్టికలో టాప్ ప్లేస్ దక్కించుకుంది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కూడా 19 పాయింట్లనే సాధించినప్పటికీ.. రన్‌రేట్‌ కారణంగా రెండో స్థానంలో నిలిచింది. గుజరాత్‌ టైటాన్స్ (18), ముంబై ఇండియన్స్ (16 పాయింట్లు) మూడు, నాలుగో స్థానాల్లో నిలిచాయి. టాప్ 2లో ఉన్న పంజాబ్, బెంగళూరు క్వాలిఫయర్‌ 1లో తలపడతాయి. గుజరాత్‌, ముంబై టీమ్స్ ఎలిమినేటర్‌లో ఢీకొంటాయి. ఇక క్వాలిఫయర్‌-1లో ఓడిన జట్టు, ఎలిమినేటర్‌ గెలిచిన టీమ్ క్వాలిఫయర్‌ 2లో పోటీపడతాయి. తొలి క్వాలిఫయర్‌ (మే 29), ఎలిమినేటర్‌ (మే 30) మ్యాచ్‌లకు ముల్లాన్‌పూర్‌.. క్వాలిఫయర్‌ 2 (జూన్‌ 1), ఫైనల్‌ (జూన్‌ 3)కు అహ్మదాబాద్‌ ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

ఐపీఎల్‌ 2025 ప్లేఆఫ్స్‌ ఇలా:
క్వాలిఫయర్‌ 1: పంజాబ్ vs బెంగళూరు (మే 29)
ఎలిమినేటర్‌: గుజరాత్‌ vs ముంబై (మే 30)
క్వాలిఫయర్‌ 2: క్వాలిఫయర్‌-1లో ఓడిన జట్టు vs ఎలిమినేటర్‌ గెలిచిన టీమ్ (జూన్‌ 1)

Exit mobile version