IPL 2025 Mega Action Rishabh Pant joins Lucknow Super Giants: జెడ్డా వేదికగా మొదలైన ఐపీఎల్ 2025 మెగా వేలం నువ్వా నేనా అన్నట్లుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో మొదట టీమిండియా ఆటగాడు రికార్డ్ శ్రేయస్ అయ్యర్ ను పంజాబ్ కింగ్స్ రూ. 26.75 కోట్లు పెట్టి భారీ ధరకు కైవసం చేసుకుంది. ఆ తర్వాత టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ ను రూ. 18 కోట్లకు పంజాబ్ కింగ్స్ ” రైట్ టు మ్యాచ్ ” ద్వారా చేజిక్కించుకుంది. ఇది ఇలా ఉండగా టీమిండియా డైనమెట్ రిషబ్ పంత్ ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ వేలంలో రికార్డ్ ధరకు కొనుగోలు చేసింది లక్నో సూపర్ జెయింట్స్. ఈ వేలంలో ఏకంగా రూ. 27 కోట్ల భారీ ధరకు లక్నో సూపర్ జెయింట్స్ రిషబ్ పంత్ దక్కించుకుంది. ఇప్పటి వరకు ఇదే అత్యధిక ధర ఒక ఆటగాడికి.
Also Read: IPL 2025 Mega Action: ఐపీఎల్ వేలంలో రికార్డ్స్ బ్రేక్ చేసిన శ్రేయాస్ అయ్యర్
మరోవైపు ఈ వేలంలో దక్షిణాఫ్రికా బౌలర్ రబడను గుజరాత్ టైటాన్స్ రూ.10.75 కోట్లకు దక్కించుకుంది. అలాగే ఇంగ్లాండ్ కెప్టెన్ జొస్ బట్లర్ ను రూ.15.75 కోట్లకు గుజరాత్ టైటాన్స్ చేజిక్కించుకుంది. ఇక 2024 ఐపీఎల్ లో భారీ ధర పలికిన మిచెల్ స్టార్క్ ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.11.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఇంకా ప్రస్తుతం ఐపీఎల్ 2025 వేలం పాట కొనసాగుతుంది.
Also Read: IPL Mega Auction LIVE: కోట్ల వర్షం..అందరి కళ్లు.. ఈ ప్లేయర్లపైనే