Site icon NTV Telugu

IPL 2025: నీకు 27 కోట్లు దండగా.. ఏడ్చేసిన లక్నో ఓనర్

Lsg

Lsg

IPL 2025: లక్నోపై సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించడంతో ప్లేఆప్స్ నుంచి లక్నో వైదొలిగింది. ఇప్పటికే హైదరాబాద్ జట్టు ప్లేఆప్స్ నుంచి నిష్క్రమించగా, ఈ జాబితాలో చెన్నై, రాజస్థాన్, కేకేఆర్, ఇప్పడు లక్నో వచ్చి చేరింది. అటు గుజరాత్,ఆర్సీబీ, పంజాబ్ ప్లేఆప్స్ స్థానాన్ని ఖాయం చేసుకున్నాయి. నాలుగో స్థానం కోసం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ పోటీ పడుతున్నాయి. రేపు ఇరు జట్లు పోటీ పడుతుండటంతో గెలిచిన జట్టు దర్జాగా ప్లేఆప్స్ కు చేరుతుంది. ఇదిలా ఉంటే కేఎల్ రాహుల్ ని వదులుకుని లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా ఇప్పుడు బాధపడుతున్నాడు. రిషబ్ పంత్ ను 27 కోట్ల భారీ ధరతో జట్టులోకి తీసుకుంటే ఐదు కోట్ల అట కూడా ఆడలేదని తల పెట్టుకుంటున్నాడు. ఈ సీజన్ లో వరుస వైఫల్యాలతో నిరాశపరిచిన పంత్ కీలక మ్యాచ్ లోనూ చెత్త షాట్ కు ప్రయత్నించి వికెట్ సమర్పించుకున్నాడు.

Deepfake: డీప్‌ఫేక్ పో*ర్న్‌పై చట్టం.. బిల్లుపై డోనాల్డ్ ట్రంప్ సంతకం..

హైదరాబాద్ బౌలర్ ఎషాన్ మలింగ స్లో యార్కర్ వేయగా.. ఆ బంతిని పంత్ ఈజీగా హ్యాండిల్ చేయాల్సింది పోయి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. పంత్ అవుట్ అయినప్పుడు లక్నో యాజమాని సంజీవ్ గోయెంకా ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ వైరల్ గా మారాయి. చాలా చిరాగ్గా లేచి వెళ్లిపోవడం గమనించవచ్చు. నీకు 27 కోట్లు దండగరా బాబు అన్నట్టు ఆయన అసహనం వ్యక్తం చేశాడు. ఈ సమయంలో కచ్చిఫ్ తో కన్నీళ్లు తుడుచుకుంటున్నట్లు కనిపించాడు. దీనికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సీజన్ ఆరంభం నుంచి గోయెంకా పంత్ విషయంలో నిరాశగానే ఉన్నాడు. ఒక్క మ్యాచ్ లోనూ పంత్ గోయెంకాను సంతృప్తి పరచలేదు. ఇప్పటి వరకు 13 మ్యాచ్ లలో కేవలం 135 పరుగులు మాత్రమే చేశాడు. చెన్నైపై 63 పరుగులు మినహాయిస్తే మిగతా మ్యాచ్ లలో గోరంగా విఫలమయ్యాడు. విశేషమేంటంటే ఆరు ఇన్నింగ్స్ లో సింగిల్ డిజిట్ కే ఔటయ్యాడు.

Devika-Danny: రొమాంటిక్ అండ్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ తో రాబోతున్న రీతు వర్మ..

Exit mobile version