Site icon NTV Telugu

Riyan Parag: వరుసగా ఆరు సిక్స్‌లు బాదిన రియాన్ పరాగ్.. వీడియో వైరల్!

Riyan Parag

Riyan Parag

ఐపీఎల్‌ 2025లో భాగంగా ఆదివారం ఈడెన్‌ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయ‌ల్స్ కెప్టెన్ రియాన్ ప‌రాగ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఒకే ఓవర్లో ఐదు సిక్స్‌లు బాదాడు. మొయిన్‌ అలీ వేసిన 13 ఓవర్‌లో వరుసగా ఐదు బంతులను స్టాండ్స్‌లోకి పంపాడు. 13వ ఓవర్ మొదటి బంతికి హెట్‌మయర్‌ సింగిల్ తీసి ఇవ్వగా.. 2, 3, 4, 5, 6 బంతులకు రియాన్ ప‌రాగ్ సిక్సులు బాదాడు. మొయిన్‌ ఓ వైడ్ కూడా వేశాడు. దాంతో ఈ ఓవర్‌లో మొత్తం 32 రన్స్ వచ్చాయి.

Also Read: MS Dhoni: సహనం కోల్పోయిన ఎంఎస్ ధోనీ.. బౌలర్‌కు చివాట్లు (వీడియో)

ఇక వరుణ్ చక్రవర్తి వేసిన 14వ ఓవర్‌లోని మొదటికి హెట్‌మయర్‌ సింగిల్ తీయగా.. రెండో బంతికి రియాన్ ప‌రాగ్ సిక్సర్ బాదాడు. దాంతో వరుసగా ఆరు బంతుల్లో 6 సిక్సులు బాడినట్లైంది. ఈ క్రమంలోనే పరాగ్ 27 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో పరాగ్ 45 బంతుల్లో 95 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. హర్షిత్‌ రాణా బౌలింగ్‌లో (17.4) వైభవ్‌ అరోరాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం వరుస సిక్స్‌లకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రియాన్ పరాగ్ తోపెహే అని ఫాన్స్ కెమెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version