Site icon NTV Telugu

KKR vs RR: బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్.. ప్లేఆఫ్స్‌ రేసులో నిలిచేనా?

Kkr Vs Rr Toss

Kkr Vs Rr Toss

ఐపీఎల్‌ 2025లో భాగంగా మరికాసేపట్లో ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్‌ అజింక్య రహానే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోల్‌కతాకు అత్యంత కీలకం. గత మ్యాచ్‌లో ఢిల్లీని ఓడించి ప్లేఆఫ్స్‌ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. 10 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలే సాధించిన కోల్‌కతా.. రాజస్థాన్‌పై గెలిచి ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో ఓడితే మాత్రం కేకేఆర్‌ పనైపోయినట్లే.

ఐపీఎల్ 2025లో 8 ఓటములతో ఇప్పటికే రాజస్థాన్‌ రాయల్స్‌ ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. ఓడినా పోయేదేమీ లేని రాజస్థాన్‌ తెగించి ఆడే అవకాశముంది. మెరుపు సెంచరీ తర్వాత డకౌటైన వైభవ్‌ సూర్యవంశీ.. ఈ మ్యాచ్‌లో ఎలా ఆడతాడో చూడాలి. ప్లేఆఫ్స్‌ రేసు పోటాపోటీగా మారుతున్న వేళ ఈ మ్యాచ్ కీలకంగా కానుంది.

Also Read: MS Dhoni: ఎంఎస్ ధోనీని ఔట్ చేయడంలో మరే ఉద్దేశం లేదు: భారత బౌలర్

తుది జట్లు:
కోల్‌కతా: రహ్మనుల్లా గుర్బాజ్‌ (కీపర్‌), సునీల్‌ నరైన్‌, అజింక్య రహానే (కెప్టెన్‌), అంగ్క్రిష్‌ రఘువంశీ, మొయిన్‌ అలీ, వెంకటేశ్‌ అయ్యర్‌, రింకు సింగ్‌, అండ్రీ రస్సెల్‌, రమణ్‌దీప్‌ సింగ్‌, వరుణ్‌ చక్రవర్తి, వైభవ్‌ అరోరా.
రాజస్థాన్‌: యశస్వి జైస్వాల్‌, వైభవ్‌ సూర్యవంశీ, రియాన్‌ పరాగ్‌ (కెప్టెన్‌), కునాల్‌ సింగ్‌ రాథోడ్‌, ధ్రువ్‌ జురేల్‌ (కీపర్‌), హెట్‌మయర్‌, హసరంగ, జోఫ్రా ఆర్చర్‌, మహీష్‌ తీక్షణ, యుధ్వీర్‌ సింగ్‌ చరక్‌, ఆకాశ్‌ మధ్వల్‌.

ఇంపాక్ట్‌ సబ్స్‌:
కోల్‌కతా: మనీష్‌ పాండే, హర్షిత్‌ రాణా, అనుకుల్‌ రాయ్‌, రోవ్‌మన్‌ పౌవెల్‌, లున్విత్‌ సిసోడా.
రాజస్థాన్‌: కుమార్‌ కార్తికేయ, శుభమ్‌ దూబే, తుషార్‌ దేశ్‌ పాండే, క్వేనా మఫాకా, అశోక్‌ శర్మ.

Exit mobile version