Rohit Sharma: తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ!
- చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
- 2007లో రోహిత్ టీ20 అరంగేట్రం
- 18 ఏళ్లుగా టీ20 ఫార్మాట్ ఆడుతున్న హిట్‌మ్యాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో 450 మ్యాచ్‌ల మైలురాయి అందుకున్న తొలి భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్ 2025లో భాగంగా శనివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌తో హిట్‌మ్యాన్ ఈ ఫీట్ సాధించాడు. ఏప్రిల్ 2007లో బరోడాతో జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు తరపున రోహిత్ టీ20 అరంగేట్రం చేశాడు. 18 ఏళ్లుగా టీ20 ఫార్మాట్ ఆడుతున్న హిట్‌మ్యాన్.. 450 మ్యాచ్‌ల మైలురాయి అందుకున్నాడు.
టీ20 ఫార్మాట్లో భారత్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జాబితాలో రోహిత్ శర్మ తర్వాతి స్థానంలో దినేష్ కార్తీక్ ఉన్నాడు. భారత మాజీ వికెట్ కీపర్ అయిన డీకే 412 టీ20లు ఆడాడు. ఐపీఎల్ 2024 తర్వాత కార్తీక్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. అయితే సౌతాఫ్రికా 20 లీగ్ 2025లో పార్ల్ రాయల్స్ తరపున ఆడాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ(401) మూడో స్థానంలో ఉన్నాడు. విరాట్ టీ20 క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు కానీ.. ఐపీఎల్ ఆడుతున్నాడు. ఎంఎస్ ధోనీ (393), సురేశ్ రైనా (336) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఐపీఎల్ 2025లో మహీ 400 మార్క్ అందుకోనున్నాడు.
Also Read
Also Read: SRH-HCA: హెచ్‌సీఏ అధ్యక్షుడి బెదిరింపులు.. హైదరాబాద్ వీడిపోతామంటున్న ఎస్ఆర్హెచ్!
2007లో ముంబై జట్టు తరఫున బరోడాతో రోహిత్ శర్మ తన టీ20 క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభించాడు. అదే ఏడాది భారత జట్టులోకి వీచదు. 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అప్పటి నుంచి ప్రతీ టీ20 ప్రపంచకప్ హిట్‌మ్యాన్ ఆడాడు. రెండు టీ20 ప్రపంచకప్‌లు గెలిచిన తొలి భారత ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. 2007లో ఆటగాడిగా.. 2024లో కెప్టెన్‌గా టీ20 ప్రపంచకప్ అందుకున్నాడు. 2024 ప్రపంచకప్ అనంతరం రోహిత్ భారత్ తరఫున టీ20లకు వీడ్కోలు పలికాడు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!