NTV Telugu Site icon

Rohit Sharma: తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ!

Rohit Sharma Mi

Rohit Sharma Mi

ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్‌లో 450 మ్యాచ్‌ల మైలురాయి అందుకున్న తొలి భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్ 2025లో భాగంగా శనివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌తో హిట్‌మ్యాన్ ఈ ఫీట్ సాధించాడు. ఏప్రిల్ 2007లో బరోడాతో జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు తరపున రోహిత్ టీ20 అరంగేట్రం చేశాడు. 18 ఏళ్లుగా టీ20 ఫార్మాట్‌ ఆడుతున్న హిట్‌మ్యాన్.. 450 మ్యాచ్‌ల మైలురాయి అందుకున్నాడు.

టీ20 ఫార్మాట్‌లో భారత్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జాబితాలో రోహిత్ శర్మ తర్వాతి స్థానంలో దినేష్ కార్తీక్ ఉన్నాడు. భారత మాజీ వికెట్ కీపర్ అయిన డీకే 412 టీ20లు ఆడాడు. ఐపీఎల్ 2024 తర్వాత కార్తీక్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. అయితే సౌతాఫ్రికా 20 లీగ్ 2025లో పార్ల్ రాయల్స్ తరపున ఆడాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ(401) మూడో స్థానంలో ఉన్నాడు. విరాట్ టీ20 క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు కానీ.. ఐపీఎల్ ఆడుతున్నాడు. ఎంఎస్ ధోనీ (393), సురేశ్ రైనా (336) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఐపీఎల్ 2025లో మహీ 400 మార్క్ అందుకోనున్నాడు.

Also Read: SRH-HCA: హెచ్‌సీఏ అధ్యక్షుడి బెదిరింపులు.. హైదరాబాద్‌ వీడిపోతామంటున్న ఎస్‌ఆర్‌హెచ్‌!

2007లో ముంబై జట్టు తరఫున బరోడాతో రోహిత్ శర్మ తన టీ20 క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభించాడు. అదే ఏడాది భారత జట్టులోకి వీచదు. 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అప్పటి నుంచి ప్రతీ టీ20 ప్రపంచకప్ హిట్‌మ్యాన్ ఆడాడు. రెండు టీ20 ప్రపంచకప్‌లు గెలిచిన తొలి భారత ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. 2007లో ఆటగాడిగా.. 2024లో కెప్టెన్‌గా టీ20 ప్రపంచకప్ అందుకున్నాడు. 2024 ప్రపంచకప్‌ అనంతరం రోహిత్ భారత్ తరఫున టీ20లకు వీడ్కోలు పలికాడు.