Site icon NTV Telugu

IPL 2025 Final: హై-వోల్టేజ్ మ్యాచ్‌కు సర్వం సిద్ధం.. మొదట బ్యాటింగ్ చేయనున్న ఆర్సీబి..!

Ipl 2025 Final (1)

Ipl 2025 Final (1)

IPL 2025 Final: ఇప్పటి వరకు ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కూడా అందుకోని రెండు జట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య 2025 ఐపీఎల్ సీజన్ ఫైనల్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నేడు గ్రాండ్‌గా ఆరంభమైంది. ఈ హైవోల్టేజ్ ఫైనల్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు తమ గత మ్యాచ్‌లలో ఆడిన జట్లనే కొనసాగిస్తూ, ఎటువంటి మార్పులు చేయలేదు. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్‌కు ఒక కొత్త ఛాంపియన్ అవతరించనుంది.

Read Also: Tata Harrier EV: సింగిల్ ఛార్జ్.. 627 కి.మీ. రేంజ్‌, లెవల్ 2 ADAS ఫీచర్లతో టాటా హ్యారియర్ EV లాంచ్..!

ఇకపోతే ఈ సీజన్‌లో బెంగళూరు ఆటలో విభిన్నత చూపించింది. కెప్టెన్ రజత్ పటీదార్ నాయకత్వంలో RCB బలంగా నిలిచింది. క్వాలిఫయర్-1లో పంజాబ్‌ను ఓడించి నేరుగా ఫైనల్‌కు అడుగుపెట్టింది. ఇది బెంగళూరు ఫ్రాంఛైజీకి నాల్గవ ఫైనల్. ఇక విరాట్ కోహ్లీ పైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటివరకు ఈ సీజన్ లో 614 పరుగులు చేసి RCB బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచాడు. ఫైనల్‌లో కూడా అతని పై భారీ భారం పడనుంది.

ఇక మరోవైపు పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్ జట్టు తల రాతను తిరగరాస్తున్నాడు. అతను సారథ్యం వహించిన తర్వాత జట్టు టాప్ ఫామ్‌ లోకి వచ్చింది. లీగ్ దశలో టేబుల్ టాపర్‌గా నిలిచిన పంజాబ్, క్వాలిఫయర్-2లో ముంబయి ఇండియన్స్‌ను ఓడించి ఫైనల్ బాట పట్టింది. శ్రేయస్ ఒక్క కెప్టెన్సీనే కాకుండా బ్యాటింగ్‌ లోనూ చెలరేగాడు. ఇప్పటివరకు 603 పరుగులు చేసి అద్భుత ఫర్‌ఫార్మెన్స్‌ ఇచ్చాడు. ఇక నేడు ఆడబోయే ఇరుజట్ల పూర్తి ఆటగాళ్ల లిస్ట్ ఇలా ఉంది.

Read Also: IPL 2025 Final PBKS: బ్యాటింగ్ ఓకే.. మరి బౌలింగ్ పరిస్థితేంటి..? కొత్త ఛాంపియన్‌గా పంజాబ్ నిలుస్తుందా..?

RCB Playing XI (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు):
ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్, రజత్ పటీదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రొమారీ షెఫర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్, జోష్ హేజిల్‌వుడ్.

RCB ఇంపాక్ట్ ప్లేయర్స్:
సుయాష్ శర్మా, రసిఖ్ దార్, మనోజ్ భండాగే, టిమ్ సైఫర్ట్, స్వప్నిల్ సింగ్.

PBKS Playing XI (పంజాబ్ కింగ్స్ జట్టు):
ప్రియాంష్ ఆర్య, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఓమర్‌జాయ్, విజయ్‌కుమార్ వైశాక్, కైల్ జేమిసన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.

PBKS ఇంపాక్ట్ ప్లేయర్స్:
ప్రభ్ సిమ్రాన్ సింగ్, జేవియర్ బార్ట్లెట్, హర్ప్రీత్ బ్రార్, సూర్యాంశ్ శేడ్గే, ప్రవీణ్ దూబే.

Exit mobile version