IPL 2025 Final: హై-వోల్టేజ్ మ్యాచ్‌కు సర్వం సిద్ధం.. మొదట బ్యాటింగ్ చేయనున్న ఆర్సీబి..!
- ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్‌కు సర్వం సిద్ధం.
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్.
- మొదట బ్యాటింగ్ చేయనున్న ఆర్సీబి.
- ఎలాంటి మార్పులు లేని జట్లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2025 Final: ఇప్పటి వరకు ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కూడా అందుకోని రెండు జట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య 2025 ఐపీఎల్ సీజన్ ఫైనల్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నేడు గ్రాండ్‌గా ఆరంభమైంది. ఈ హైవోల్టేజ్ ఫైనల్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు తమ గత మ్యాచ్‌లలో ఆడిన జట్లనే కొనసాగిస్తూ, ఎటువంటి మార్పులు చేయలేదు. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్‌కు ఒక కొత్త ఛాంపియన్ అవతరించనుంది.
Also Read
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- Gautam Gambhir: "ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?".. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
ఇకపోతే ఈ సీజన్‌లో బెంగళూరు ఆటలో విభిన్నత చూపించింది. కెప్టెన్ రజత్ పటీదార్ నాయకత్వంలో RCB బలంగా నిలిచింది. క్వాలిఫయర్-1లో పంజాబ్‌ను ఓడించి నేరుగా ఫైనల్‌కు అడుగుపెట్టింది. ఇది బెంగళూరు ఫ్రాంఛైజీకి నాల్గవ ఫైనల్. ఇక విరాట్ కోహ్లీ పైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటివరకు ఈ సీజన్ లో 614 పరుగులు చేసి RCB బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచాడు. ఫైనల్‌లో కూడా అతని పై భారీ భారం పడనుంది.
ఇక మరోవైపు పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్ జట్టు తల రాతను తిరగరాస్తున్నాడు. అతను సారథ్యం వహించిన తర్వాత జట్టు టాప్ ఫామ్ లోకి వచ్చింది. లీగ్ దశలో టేబుల్ టాపర్‌గా నిలిచిన పంజాబ్, క్వాలిఫయర్-2లో ముంబయి ఇండియన్స్‌ను ఓడించి ఫైనల్ బాట పట్టింది. శ్రేయస్ ఒక్క కెప్టెన్సీనే కాకుండా బ్యాటింగ్ లోనూ చెలరేగాడు. ఇప్పటివరకు 603 పరుగులు చేసి అద్భుత ఫర్‌ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక నేడు ఆడబోయే ఇరుజట్ల పూర్తి ఆటగాళ్ల లిస్ట్ ఇలా ఉంది.
RCB Playing XI (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు):
ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్, రజత్ పటీదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రొమారీ షెఫర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్, జోష్ హేజిల్‌వుడ్.
RCB ఇంపాక్ట్ ప్లేయర్స్:
సుయాష్ శర్మా, రసిఖ్ దార్, మనోజ్ భండాగే, టిమ్ సైఫర్ట్, స్వప్నిల్ సింగ్.
PBKS Playing XI (పంజాబ్ కింగ్స్ జట్టు):
ప్రియాంష్ ఆర్య, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఓమర్‌జాయ్, విజయ్‌కుమార్ వైశాక్, కైల్ జేమిసన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.
PBKS ఇంపాక్ట్ ప్లేయర్స్:
ప్రభ్ సిమ్రాన్ సింగ్, జేవియర్ బార్ట్లెట్, హర్ప్రీత్ బ్రార్, సూర్యాంశ్ శేడ్గే, ప్రవీణ్ దూబే.
తాజావార్తలు
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!