Yuzvendra Chahal: ఐపీఎల్ 2025లో ఇక కేవలం రెండు మ్యాచ్‌లే మిగిలి ఉన్నాయి. అందులో ఒకటి నేడు జరగబోయే క్వాలిఫయర్-2 మ్యాచ్. ఇందులో పంజాబ్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా తలపడనున్నాయి. ఈ కీలక సమరానికి ముందు పంజాబ్ జట్టుకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది. ఇటీవల గాయంతో జట్టుకు దూరమైన స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తిరిగి బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Also: IPL 2025 Qualifier 2: ముంబై vs పంజాబ్ మ్యాచ్ కు వర్షం అడ్డుకాబోతుందా.. అయితే ఫైనల్ చేరుకునేది ఎవరు?
పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రధాన బలంగా ఉన్న చాహల్ లీగ్ దశలో చివరి రెండు మ్యాచ్ లతో పాటు క్వాలిఫయర్-1లో కూడా ఆడలేకపోయాడు. గాయం కారణంగా అతను జట్టుకు దూరమయ్యాడు. అతని గైర్హాజరీ స్పిన్ విభాగాన్ని బలహీనంగా మార్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం చాహల్ తన గాయాన్ని అధిగమించి తిరిగి ఫిట్‌నెస్ సాధించాడు. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో చాహల్ తన జట్టుతో కలిసి బౌలింగ్ ప్రాక్టీస్, కెచింగ్ డ్రిల్స్ చేయడం ద్వారా తిరిగి మైదానంలోకి వచ్చే సన్నద్ధతను చూపించాడు. అతని పాల్గొనడం పంజాబ్ అభిమానులకు ఉత్సాహాన్నిస్తుంది.
Read Also: WhatsApp: నేటి నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సాప్ బంద్.. లిస్టులో మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి
34 ఏళ్ల యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ బౌలర్లలో ఒకడు. ఈ సీజన్‌లో అతను 12 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసినప్పటికీ, అతని ఇకానమీ రేట్ 9.56 ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ పై హ్యాట్రిక్ సాధించి, తన మెరుగైన ఫామ్‌ను చూపించాడు. పంజాబ్ కింగ్స్ 2025 వేలంలో అతన్ని రూ. 18 కోట్ల భారీ మొత్తంతో కొనుగోలు చేసింది. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయగల శక్తివంతమైన ఆయుధంగా చాహల్ నిలిచాడు. ఇకపోతే, పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో టైటిల్ గెలవలేకపోయింది. అయితే 2025లో లీగ్ దశలో 14 మ్యాచుల్లో 9 గెలిచి టాప్‌లో నిలిచింది. క్వాలిఫయర్-1లో RCB చేతిలో ఓడిన తర్వాత ఇప్పుడు ముంబయి ఇండియన్స్‌తో ఫైనల్ బెర్త్ కోసం పోరాడుతోంది. చాహల్ తిరిగి జట్టులోకి వచ్చి మళ్లీ మాయ చేస్తే పంజాబ్ ఫైనల్‌కు చేరుకుంటుంది.
మొత్తంగా ఈరోజు జరిగే కీలక మ్యాచ్‌లో చాహల్ ఫిట్‌గా ఉంటే అతని ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అతని అనుభవం, మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయగల సామర్థ్యం ముంబయి ఇండియన్స్ వంటి బలమైన జట్టుతో తలపడే సమయంలో పంజాబ్‌కు భారీ ప్లస్ కావొచ్చు. పంజాబ్ అభిమానులు జట్టుకు తొలి టైటిల్ గెలిపించాలని ఆశిస్తున్నారు.
