NTV Telugu Site icon

IPL 2025-MI: ముంబై జట్టులో భారీ మార్పులు ఖాయం.. హార్దిక్‌, రోహిత్ సహా..: ఆకాశ్

Hardik Rohit Mi

Hardik Rohit Mi

Mumbai Indians IPL 2025 Auction: ఐపీఎల్‌ 2025 మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్‌ జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. హెడ్ కోచ్‌ మార్క్ బౌచర్‌ స్థానంలో మహేల జయవర్థనే వచ్చాడు. ఐపీఎల్ 2024లో బౌచర్‌ కోచ్‌గా ఉన్నప్పుడు రోహిత్‌ శర్మని కెప్టెన్‌గా తొలగించి.. హార్దిక్‌ పాండ్యాని నియమించిన విషయం తెలిసిందే. హార్దిక్‌ ఫామ్‌లో లేకపోవడం, జట్టులో సమన్వయ లోపంతో ముంబై పాయింట్ల పట్టికలో చివరి స్థానాని పరిమితమైంది. గత కొద్దిరోజులుగా రోహిత్‌ జట్టుని వీడతాడనే వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఐపీఎల్ 2025 మెగా వేలం నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు ఆకాశ్‌ చోప్రా స్పందించాడు. ముంబై ప్రాంచైజీ ఆరుగురు ఆటగాళ్లని రిటైన్‌ చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని తెలిపాడు. కీలక ప్లేయర్లను అతిపెట్టుకోవడానికి రూ.79 కోట్లు వెచ్చించినా.. ముంబై ఫ్రాంచైజీకి ఎలాంటి నష్టం లేదన్నాడు.

‘మహేల జయవర్దనే తిరిగి ముంబై జట్టులోకి వచ్చాడు. దీంతో జట్టులో మార్పులు చోటుచేసుకుంటాయి. హార్దిక్‌ పాండ్యా ఫామ్‌లోకి వచ్చాడు. కాబట్టి ఐదుగురు కీలక ఆటగాళ్లని రిటైన్‌ చేసుకొని ఒకరిని అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌గా తీసుకునేందుకు ముంబై చూస్తుంది. హార్దిక్‌ సహా రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ లేదా ఇషాన్‌ కిషన్‌ని రిటైన్‌ చేసుకొనే ఛాన్స్‌ ఉంది. అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా నెహాల్‌ వధేరాని తీసుకోవాలని భావిస్తోంది. వీరికి రూ.79 కోట్లు వెచ్చించి.. మిగతా మొత్తంతో వేలానికి వెళ్తుందని అనుకుంటా’ అని ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు.

Also Read: Sanju Samson: టీమిండియాలో మళ్లీ అవకాశం వస్తుందని ఊహించలేదు: శాంసన్

‘మహేల జయవర్థనే గొప్ప ఆటగాడు. బ్యాటర్, కెప్టెన్‌గా శ్రీలంకకు ఎన్నో విజయాలు అందించాడు. అతడికి ముంబైతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. బౌలింగ్ కోచ్‌గా పరాస్‌ మాంబ్రేని నియమించడం మంచి విషయం. గత సీజన్‌లో జట్టు బౌలింగ్‌ ప్రదర్శన ఏమాత్రం బాగాలేదు. ముంబైకి బౌలింగ్‌ కోచ్‌ అవసరం. అందుకే పరాస్‌ను తీసుకుంది’ అని ఆకాశ్‌ చోప్రా చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025 వేలం నవంబర్ చివరలో జరిగే అవకాశాలు ఉన్నాయి. రిటైన్‌ జాబితాను సమర్పించేందుకు ఈ నెల ఆఖరి గడువు.

Show comments