NTV Telugu Site icon

IPL 2025 Auction: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు కష్టమే.. ఈసారి నిరాశ తప్పదు: ఆకాశ్‌

Srh

Srh

నవంబర్ 24, 25 తేదీల్లో ఐపీఎల్ 2025 మెగా వేలం జరగనుంది. మూడేళ్ల పాటు ఆటగాళ్లను దక్కించుకొనేందుకు ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నాయి. వేలం కోసం క్రికెట్ అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఏ ప్లేయర్ ఎంత మొత్తం దక్కించుకుంటాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే రిటెన్షన్‌ ప్రక్తియ ముగియగా.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐదుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. ప్రస్తుతం సన్‌రైజర్స్‌ వద్ద రూ.45 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఈ సొమ్ముతో నాణ్యమైన భారత క్రికెటర్లను దక్కించుకోవడం సన్‌రైజర్స్‌కు చాలా కష్టమని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్‌ చోప్రా అన్నాడు. ఈసారి ఓవర్సీస్ ప్లేయర్లకు నిరాశ తప్పదన్నాడు.

ఆకాశ్‌ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ… ‘రిటెన్షన్‌ అనంతరం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వద్ద కేవలం రూ.45 కోట్లు మాత్రమే ఉన్నాయి. విదేశీ ఆటగాళ్లు హెన్రిచ్ క్లాసెన్ (23 18 కోట్లు), పాట్ కమిన్స్ (18 కోట్లు), ట్రావిస్ హెడ్ (14 కోట్లు) కోసం భారీగా వెచ్చించింది. ఈ ముగ్గురు ప్రతి మ్యాచ్‌ తుది జట్టులో ఉంటారు. అభిషేక్‌ శర్మ, నీతిశ్‌ కుమార్ కోసం రూ.20 కోట్లు ఖర్చు చేసింది. తుది జట్టులో భారత్‌ నుంచి మరో ఆరుగురు క్రికెటర్లు ఉండాలి. వారిని సొంతం చేసుకోవాలంటే సన్‌రైజర్స్‌ వద్ద ఉన్న మిగిలిన డబ్బు సరిపోదు. తుది జట్టులో నలుగురు కంటే ఎక్కువ మంది విదేశీ ప్లేయర్లు ఉండలేరు. బ్యాకప్‌గానూ కొందరిని తీసుకోవాలి’ అని అన్నాడు.

Also Read: Realme GT 7 Pro Launch: ‘రియల్‌మీ జీటీ 7 ప్రో’ వచ్చేసింది.. సూపర్ కెమెరా, జంబో బ్యాటరీ!

‘రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్‌ అయ్యర్, ఇషాన్ కిషన్ లాంటి స్టార్లు వేలంలో ఉన్నారు. దేవదత్ పడిక్కల్, వెంకటేశ్ అయ్యర్ కూడా మంచి ప్లేయర్స్. వీరందరూ భారీ ధర పలుకుతారు. వీరిని సన్‌రైజర్స్‌ తీసుకునే అవకాశం లేదు. మంచి బౌలర్లు జట్టుకు అవసరం. మరి సన్‌రైజర్స్‌ ఎవరిని తీసుకుంటుందో చూడాలి. ముంబై రిటైన్షన్‌లో భారత క్రికెటర్లనే తీసుకుంది. విదేశీ క్రికెటర్లను తీసుకొవాల్సిన అవసరం ఉంది. ఫ్రాంచైజీల వద్ద ఎక్కువ డబ్బు లేకపోవడంతో ఈసారి ఓవర్సీస్ ప్లేయర్లకు నిరాశ తప్పదు. భారత క్రికెటర్లకే మెరుగైన ధర వస్తుందనుకుంటున్నా. రాబోయే మెగా వేలం ప్రాంచైజీలకు అత్యంత సంక్లిష్టం. పంజాబ్‌ వద్ద భారీగా డబ్బు ఉన్నా.. తీసుకోవాల్సిన ప్లేయర్ల సంఖ్య భారీగానే ఉంది. టాప్‌ ప్లేయర్ల కోసం పంజాబ్‌ చూస్తోంది’ అని ఆకాశ్‌ చోప్రా చెప్పుకోచ్చాడు.