NTV Telugu Site icon

Rohit Sharma-MI: ముంబై ఇండియన్స్‌తో రోహిత్ శర్మ ప్రయాణం ముగిసినట్లే!

Rohit Sharma Mumbai

Rohit Sharma Mumbai

ఈ ఏడాది చివరలో ఐపీఎల్ 2025కు సంబందించిన మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. మెగా వేలం నేపథ్యంలో అందరి చూపు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపైనే ఉంది. ఇందుకు కారణం ముంబై ఇండియన్స్‌కు ఐదుసార్లు ట్రోఫీలు అందించిన రోహిత్‌.. ఆ జట్టులోనే కొనగాగుతాడా? లేదా? అని. గత కొంత కాలంగా హిట్‌మ్యాన్ ఐపీఎల్ భవితవ్యంపై చర్చ కొనసాగుతోంది. ముంబైలో ఉండడం రోహిత్‌కు ఇష్టం లేదని, వేరే జట్టుకు వెళ్లిపోతాడు అని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈనేపథ్యంలో రోహిత్‌ భవితవ్యంపై తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్‌, కామెంటేటర్ ఆకాశ్‌ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

తన యూట్యూబ్‌ ఛానల్‌లో ఆకాశ్‌ చోప్రా మాట్లాడుతూ.. ముంబై ఇండియన్స్‌తో రోహిత్ శర్మ ప్రయాణం ముగిసినట్లే అని అభిపాయపడ్డాడు. ‘రోహిత్‌ శర్మ ముంబైతో ఉంటాడా? లేదా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. హిట్‌మ్యాన్ ముంబైతో ఉండడని నేను అనుకుంటున్నా. మూడేళ్లు ఆడగలిగితేనే జట్టులో రిటైన్‌ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఎంఎస్ ధోనీకి ఇది వర్తించదు. ధోనీ – చెన్నై కథ వేరు. రోహిత్‌ స్వయంగా ముంబై నుంచి వెళ్లిపోవచ్చు లేదా ముంబై మేనేజ్మెంటే అతడిని విడిచిపెట్టవచ్చు. ఏదైనా జరగొచ్చు’ అని ఆకాశ్‌ అన్నాడు.

Also Read: Devara Part 1: ‘దేవర’ కొత్త కథ కాదు.. కానీ కొత్త కొరటాలను చూస్తారు!

‘ఏదేమైనా రోహిత్‌ శర్మ ముంబై ఇండియన్స్‌లో కొనసాగుతాడని నేను అస్సలు అనుకోవడం లేదు. నా వద్ద రోహిత్ గురించి పెద్దగా సమాచారం లేదు కానీ.. హిట్‌మ్యాన్‌ను ముంబై వదిలేస్తుందని అనుకుంటున్నా. ఐపీఎల్ 2025 వేలంలో రోహిత్‌ను వేరే జట్లు తీసుకోవచ్చు. అతడికి భారీ ధర ఖాయం. ముంబై ఇండియన్స్‌తో అతడి ప్రయాణం ఇక ముగిసినట్లేనని నేను అనుకుంటున్నా’ అని ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024 ముందు రోహిత్‌ను తప్పించి.. హార్దిక్ పాండ్యాకు జట్టు సారథ్య బాధ్యతలు ముంబై అప్పగించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి హిట్‌మ్యాన్‌ నిరాశలో ఉన్నాడట.

Show comments