Virat Kohli: ప్రజలు మమ్మల్ని గుర్తించని చోట 2 నెలలు ఉన్నాం.. ఆ అనుభవం అవాస్తవం: కోహ్లీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli React on Two Months Vaccation ahead IPL 2024: గత రెండు నెలలు భారత్‌లో లేనని.. తనని, తన ఫ్యామిలీని గుర్తుపట్టని ప్రాంతంలో సమయాన్ని గడిపామని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. లండన్‌లో కుటుంబంతో కలిసి సాధారణ సమయాన్ని గడిపానని. ఆ అనుభవం అవాస్తవంగా అనిపించిందన్నాడు. కుటుంబ కోణం నుంచి చూస్తే విషయాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయని, కుటుంబంతో గడపడానికి అవకాశం ఇచ్చినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు అని విరాట్ పేర్కొన్నాడు. ఫిబ్రవరిలో విరాట్ సతీమణి అనుష్క శర్మ అకాయ్‌కి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ప్రసవ సమయంలో భార్య పక్కన ఉండేందుకు విరాట్ రెండు నెలలు క్రికెట్‌కు దూరమయ్యాడు.
సోమవారం రాత్రి చిన్నస్వామి స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆర్సీబీ విజయంలో విరాట్ కోహ్లీ (77; 49 బంతుల్లో 11×4, 2×6) కీలక పాత్ర పోషించాడు. ‘ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న విరాట్ మాట్లాడుతూ.. ఫ్యాన్స్ నుంచి లభిస్తున్న మద్దతుపై సంతోషం వ్యక్తం చేశాడు. ‘చిన్నస్వామి మైదానంలో అభిమానుల మధ్య కలిసి ఎన్నో ఏళ్ల నుంచి ఆడుతున్నా. అయితే ఆటలో సాధించిన ఘనతలు, గణాంకాలు, నంబర్స్, రికార్డులు గురించి ప్రజలు మాట్లాడుతుంటారు. కానీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూస్తే.. కనిపించేవి జ్ణాపకాలే. రాహుల్ ద్రవిడ్ ఎప్పుడూ ఇదే చెబుతుంటాడు. ఆడే సమయంలో ప్రాణం పెట్టి ఆడాలని చెప్పేవాడు. అందరి నుంచి ప్రేమ, ప్రశంసలు, మద్దతు అందుకోవడం అద్భుతంగా ఉంది’ అని విరాట్ అన్నాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: Virat Kohli: ‘ఛీటర్-ఛీటర్’ అంటూ నినాదాలు.. కోహ్లీ హృదయాన్ని ముక్కలు చేసిన భారత ఫాన్స్!
‘రెండు నెలలు భారత్‌లో లేను. మమ్మల్ని ఎవరూ గుర్తుపట్టని ప్రాంతంలో ఉన్నాం. కుటుంబంతో కలిసి సాధారణ సమయాన్ని గడిపా. ఆ అనుభవం అవాస్తవంగా అనిపించింది. వాస్తవానికి ఇద్దరు పిల్లలను కలిగి ఉండటం, కుటుంబ కోణం నుంచి విషయాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. పిల్లలతో బంధం ఎంతో బాగుంటుంది. కుటుంబంతో గడపడానికి అవకాశం ఇచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. రోడ్లపై మరొక వ్యక్తిగా తిరగడం, ఎవరూ నను గుర్తించబడకపోవడం అద్భుతమైన అనుభవం. ఇక్కడ కూడా ఇదే కోరుకుంటున్నా. ఇక కుటుంబ పరంగా ఇద్దరు పిల్లలని కలిగి ఉండటం సంతోషకరమై విషయం’ అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!