ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్ 2024 సీజన్ లో భాగంగా ఆదివారం రాత్రి కలకత్తా నైట్ రైడర్స్ తో రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు తలపడిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడైన విరాట్ కోహ్లీకి భారీగా ఫైన్ పడింది. అంపైర్లతో గొడవ నేపథ్యంలో భాగంగా విరాట్ కోహ్లీకి ఈ ఫైన్ వేధించబడింది. అంపైర్స్ తో గొడవ ఐపీఎల్ లో నిబంధనలో భాగంగా విరాట్ కోహ్లీకి మ్యాచ్ ఫీజులో ఏకంగా 50% ఫైన్ విధించింది బిసిసిఐ.
Also Read: Tammy Beaumont: బాయ్‌ఫ్రెండ్‌తో పెళ్లి కానిచ్చేసిన స్టార్ క్రికెటర్..
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఐపిఎల్ నియమావళిని ఉల్లంఘించినట్లు మ్యాచ్ రిఫరీ బిసిసిఐకు నివేదనను అందించాడు. దాంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నబీసీసీఐ.. కోహ్లీ చేసిన తప్పిదంకు గాను ఏకంగా మ్యాచ్ ఫీజులో 50% కోత విధించింది. ఇకపోతే ఈ విషయాన్ని కోహ్లీ కూడా ఒప్పుకోవడంతో మొదటి స్థాయి పొరపాటు కింద కోహ్లీకి మ్యాచ్ ఫీజులో సగం మ్యాచ్ ఫీజ్ ను జరిమానగా విధించారు.
Also Read: Car Accident: వామ్మో.. కంటైనర్ కిందకు దూసుకెళ్లిన కారు.. వైరల్ వీడియో..
ఇకపోతే ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ కాస్త వివాదాస్పద రీతిలో అవుట్ అవ్వడం ఇందుకు కారణం. భారీ లక్ష చేదనలో భాగంగా విరాట్ కోహ్లీ ఆడుతుండగా 18 పరుగులతో ఉన్న సమయంలో హర్షిత్ రానా బౌలింగ్ లో అతనికి రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. అయితే ఆ బాల్ హై ఫుల్ టాస్ బంతిని నోబెల్ ఇవ్వకపోవడంతో విరాట్ కోహ్లీ నేరుగా గ్రౌండ్ అంపైర్ తో గొడవకు దిగడంతో ఈ తతంగం నడిచింది. విరాట్ కోహ్లీ బాల్ ను నోబాల్ గా ప్రకటించాలని చెప్పిన దానికి వారు అంగీకరించలేదు. దాంతో అంపైర్ పై విరాట్ అసహనం వ్యక్తం చేయడంతో చివరకు మ్యాచ్ ఫీజు కోత పడింది. ఇక ఈ మ్యాచ్ లో కలకత్తా నైట్ రైడర్స్ కేవలం ఒక్క పరుగుతో ఆర్సిబి జట్టు పై విజయం సాధించింది.