NTV Telugu Site icon

IPL 2024: బీసీసీఐకి షాకిచ్చిన ఈసీబీ.. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ ల‌కు దూరంకానున్న ఇంగ్లాండ్ స్టార్ ఆట‌గాళ్లు..

Ipl 2024

Ipl 2024

టీ20 ప్రపంచకప్‌ 2024 కు సమయం ఆసన్నమైంది. ఈ ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఒక నెలలో ప్రారంభమవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, టోర్నీలో పాల్గొనే 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను తాజాగా అన్ని జట్లు ప్రకటించాయి. ఇందులో ఇంగ్లాండ్ టీం కూడా జట్టును ప్రకటించింది. బట్లర్ నేతృత్వంలో ఇంగ్లండ్ టీ20 ప్రపంచకప్‌లో పాల్గొంటుంది. గాయం కారణంగా దాదాపు ఏడాది పాటు దూరంగా ఉన్న జోఫ్రా ఆర్చర్ టోర్నీకి తిరిగి రానున్నాడు.

Also Read: OnePlus Nord 4: నయా స్మార్ట్‌ఫోన్ తీసుకరాబోతున్న వన్‌ప్లస్.. ఫీచర్లు ఇవే..

కాగా, టీ20 ప్రపంచకప్‌కు ఎంపికైన ఆటగాళ్లను స్వదేశానికి తీసుకురావాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు పిలుపునిచ్చింది. టీ20 ప్రపంచకప్‌ కు ముందు ఇంగ్లండ్ పాకిస్థాన్‌తో నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. మే 22 నుంచి 30 వరకు ఈ సిరీస్ జరుగుతుందని.. ఐపీఎల్‌లో ఆడే వరల్డ్ కప్ ఎంపికైన ఆటగాళ్లు సిరీస్‌ లో ఆడాలంటే సిరీస్ ప్రారంభానికి రెండు రోజుల ముందు రావాలని చెప్పారు. దీంతో జోస్ బట్లర్, జానీ బెయిర్‌స్టో వంటి ఆటగాళ్లు ఐపీఎల్ ప్లేఆఫ్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండరు. ఇది ఆయా ఫ్రాంచైజీలకు గట్టి ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు.

Also Read: Prasanth Varma: ఆ వీడియో చూసి కన్నీళ్లు పెట్టుకున్న ప్రశాంత్ వర్మ..

ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్‌కు దూర‌మ‌య్యే ఆట‌గాళ్ల వివరాలు చూస్తే.. జోస్ బట్లర్ (రాజస్థాన్ రాయల్స్), జానీ బెయిర్‌స్టో (పంజాబ్ కింగ్స్), మొయిన్ అలీ (చెన్నై సూపర్ కింగ్స్), సామ్ కరణ్ (పంజాబ్ కింగ్స్), ఫిల్ సాల్ట్ (కోల్‌కతా నైట్ రైడర్స్), లియామ్ లివింగ్‌స్టోన్ (పంజాబ్ కింగ్స్), విల్ జాక్స్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), రీస్ టాప్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) లు ఉన్నారు.

ఇక నేడు ప్రకటించిన ఇంగ్లండ్ టీ20 ప్రపంచకప్ జట్టు చూస్తే.. జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, బెయిర్డ్ స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కర్రాన్, బెన్ డకెట్, టామ్ హర్ట్లీ, విల్ జాక్స్, క్రిస్ జోర్డాన్, లివింగ్ స్టోన్, ఆదిల్ రషీద్. , ఫిల్ సాల్ట్, రీస్ టోప్లీ, మార్క్ వుడ్ లు ఉన్నారు.

Show comments