IPL 2024: రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్న స్టార్ క్రికెటర్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు షాక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SRH Player Wanindu Hasaranga To Miss initial IPL 2024 Games: టెస్టు క్రికెట్ రిటైర్మెంట్ను శ్రీలంక స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగా వెనక్కి తీసుకున్నాడు. శ్రీలంక క్రికెట్ బోర్డు సూచన మేరకు అతడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అంతేకాదు బంగ్లాదేశ్‌తో త్వరలో జరగనున్న టెస్టు సిరీస్ కోసం శ్రీలంక ప్రకటించిన జట్టులో హసరంగాకు చోటు దక్కింది. సోమవారం బంగ్లా సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన జట్టును శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది.
పరిమిత ఓవర్ల క్రికెట్‌పై దృష్టి సారించేందుకు గతేడాది ఆగస్టులో వనిందు హసరంగా టెస్టు క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. బోర్డు సూచన మేరకు తన నిర్ణయాన్ని మార్చుకున్న హసరంగా.. మళ్లీ రెడ్‌బాల్ క్రికెట్ ఆడేందుకు సిద్దమయ్యాడు. లంక తరఫున హసరంగా 4 టెస్టులు ఆడాడు. 54 వన్డేలు, 65 టీ20లు ఆడాడు. హసరంగా ఆల్‌రౌండర్ అన్న విషయం తెలిసిందే. స్పిన్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ కూడా చేస్తాడు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌కు వనిందు హసరంగా ఎంపిక కావడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు షాక్ తగిలింది. ఐపీఎల్ 2024 ఆరంభ మ్యాచులకు అతడు దూరం కావాల్సి ఉంటుంది. బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ మార్చి 26 నుంచి, రెండో టెస్ట్ ఏప్రిల్ 3 నుంచి ఆరంభం అవుతాయి. దాంతో సన్‌రైజర్స్ ఆడే ఆరంభ మ్యాచులకు హసరంగా దూరం కానున్నాడు. ఐపీఎల్ 17వ సీజన్ మార్చి 22 నుంచి ఆరంభం అవుతున్న విషయం తెలిసిందే.
Also Read: Hardik-Rohit: రోహిత్‌తో ఎలాంటి ఇబ్బంది ఉండదు.. నాకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు: హార్దిక్
శ్రీలంక టెస్టు జట్టు:
ధనంజయ డిసిల్వా (కెప్టెన్), కుసాల్ మెండిస్ (వైస్ కెప్టెన్), దిముత్ కరుణరత్నే, నిషాన్ మదుష్క, ఏంజెలో మాథ్యూస్, దినేష్ చండిమల్, సదీర సమరవిక్రమ, కమిందు మెండిస్, లహిరు ఉదరా, వనిందు హసరంగా, ప్రబాత్ జయసూర్య, రమేష్ మెండిస్, నిషాన్ పెసిరి, నిషాన్ పెసిరి ఫెర్నాండో, లహిరు కుమార, చమిక గుణశేఖర.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!