Site icon NTV Telugu

Shivam Dube: ఇతర ఫ్రాంచైజీలకు.. చెన్నైకి అదే వ్యత్యాసం: దూబె

Shivam Dube

Shivam Dube

Shivam Dube Heap Praise on CSK Franchise: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో ఇతర ఫ్రాంచైజీలతో పోలిస్తే.. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి చాలా వ్యత్యాసం ఉంటుందని సీఎస్‌కే ఆటగాడు శివమ్ దూబె అన్నాడు. చెన్నై ఫ్రాంచైజీలో పూర్తి స్వేచ్ఛ ఉంటుందని తెలిపాడు. సీఎస్‌కే కోసం కొన్ని మ్యాచ్‌లు అయినా గెలిపించాలని తాను భావించానని దూబె పేర్కొన్నాడు. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌పై దూబె చెలరేగాడు. 23 బంతుల్లోనే 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 51 పరుగులు చేశాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన అతడికి ‘ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

Also Read: Dhoni-Rahane: మా జట్టులో అదనంగా మరో ఇద్దరు కుర్రాళ్లు ఉన్నట్లుంది: రుతురాజ్‌

‘ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌’ అవార్డు తీసుకున్న అనంతరం శివమ్ దూబె మాట్లాడుతూ… ‘ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ భిన్నమైనది. మిగతా ఫ్రాంచైజీలతో పోలిస్తే చెన్నై జట్టుకు ప్రత్యేకం. ఇక్కడ నాకు మేనేజ్మెంట్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. వారి నమ్మకాన్ని నిలబెడుతాయా. సీఎస్‌కే కోసం కొన్ని మ్యాచ్‌లనైనా గెలిపించాలని భావించా. దాని కోసం చాలా కష్టపడ్డా. గుజరాత్ టైటాన్స్ బౌలర్లు షార్ట్‌ బాల్స్‌తో ఇబ్బంది పెడతారని తెలుసు. అందుకు ముందే సిద్ధమై క్రీజ్‌లోకి వెళ్లా. చెన్నై తరఫున అత్యధిక స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్‌ చేయాలని భావించా. ఈ క్రంమలోనే దూకుడుగా ఆడాను’ అని చెప్పాడు.

Exit mobile version