Site icon NTV Telugu

IPL 2024: ప్లేఆఫ్స్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. కాకపోతే అలా జరగాలంతే..

Rcb

Rcb

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 17వ సీజన్ చివరి దశకు చేరిందని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సీజన్లో చివరకు ఎవరు ప్లే ఆప్స్ కు చేరతారన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇకపోతే ఐపిఎల్ 2024 మొదటి అర్ధ భాగంలో పేలవ ప్రదర్శన కనబడచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆ తర్వాత ఏమైందో తెలియదు గానీ ద్వితీయార్థంలో మాత్రం కనివిని ఎరగని ప్రదర్శనతో మిగతా జట్లకు వార్నింగ్ బెల్స్ ఇస్తుంది.

Also Read: TS SET 2024: తెలంగాణ సెట్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇలా..

ఈ సీజన్ లో ఇప్పటివరకు 11 మ్యాచులు ఆడిన ఆర్సిబి కేవలం 4 విజయాలతో పాయింట్లు పట్టికలో ఏడవ స్థానానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్ చేరడానికి ఆర్‌సీబీ అనేక లెక్కలు వేస్తోంది. అంటే ఆర్‌సీబీ జట్టు ప్లే ఆఫ్ లోకి ప్రవేశించాలంటే మిగతా జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు ఆర్‌సీబీకి ఉన్న మిగతా మూడు మ్యాచ్ లలో విజయం సాధిస్తే ఆర్సిబికి 14 పాయింట్లు వస్తాయి. ఈ నేపథ్యంలో లక్నో లేదా సన్ రైజర్స్ జట్ల పాయింట్లు 14 మించకూడదు. ఒకవేళ ఈ రెండు జట్లలో ఏ ఒక్క టీం 14 పాయింట్స్ తో నాలుగో స్థానంలో ఉన్న ఒకవేళ నెట్ రన్ రేట్ ఆధారంగా ఆర్‌సీబీ ప్లేఆఫ్స్ కి వచ్చే అవకాశం ఉంది.

Also Read: Virat Kohli: నీ అంత క్రికెట్ ఆడలేదు.. కోహ్లీపై ఫైర్ అయిన టీమిండియా దిగ్గజం!

ఇక అలాగే చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్రస్తుతం ఐదు మ్యాచ్లు గెలిచి పది పాయింట్లుతో ఉన్నాయి. ఈ రెండు టీమ్స్ వాటి తర్వాతి మ్యాచ్లలో రెండు అంతకంటే ఎక్కువ విజయాలు పొందకూడదు. అలాగే పంజాబ్ కింగ్స్ కూడా తనకున్న నాలుగు మ్యాచ్లలో రెండింటి ఓడిపోవాలని ఎదురు చూడాలి. దీన్ని బట్టి చూస్తే పాయింట్లు పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న ఏ జట్టు 16 పాయింట్లు సాధించకూడదు. పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు జట్లు 14 కంటే ఎక్కువ పాయింట్లు సాధిస్తే.. ఆర్‌సీబీ జట్టు ప్లే ఆఫ్ కు దూరంగా ఉంటుంది. కాబట్టి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేఆప్స్ లోకి ప్రవేశించాలంటే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.

Exit mobile version