Site icon NTV Telugu

IPL 2024 MI VS SRH: ఉప్పల్ ​లో నమోదైన సరికొత్త రికార్డులివే..!

3

3

బుధవారం రాత్రి జరిగిన ఐపిఎల్ మ్యాచ్ లో భాగంగా సన్​ రైజర్స్, ముంబై ఇండియన్స్ తలబడ్డాయి. ఇరు జట్లు ఆకాశమే హద్దుగా సిక్సర్ల వర్షం కురిపించి హైదరాబాద్ ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేసారు. ఇరు జట్లు ఆకాశమే హద్దుగా సిక్సర్ల వర్షం కురిపించి క్రికెట్ ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా మొదటి బ్యాటింగ్ చేసిన సన్​ రైజర్స్ జట్టు ఆకాశమ హద్దుగా చెలరేగి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు సాధించిన టీం గా రికార్డ్ సృష్టించింది. అయితే లక్ష చేదనలో బ్యాటింగ్ వచ్చిన ముంబై బ్యాటర్స్ కూడా తామేమి తక్కువ కాదంటూ టార్గెట్ చాలా దూరం ఉన్నా కానీ.. తమ సాయశక్తుల ప్రయత్నించారు. ఇక ఈ హై వోల్టేజ్ మ్యాచ్ లో పలు రికార్డులు నమోదయ్యాయి. వాటికి సంబంధించిన వివరాలు చూస్తే..

Also read: Fire accident: హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం.. పెద్దెతున ఎగిసిపడుతున్న మంటలు..!

ఈ మ్యాచ్‌ లో మొత్తంగా 523 పరుగులు నమోదయ్యాయి. ఐపీఎల్‌ లోని ఓ మ్యాచ్‌ లో అత్యధిక పరుగుల రికార్డు ఇదే. ఇదే మ్యాచ్ లో తొలి 10 ఓవర్లలో సన్‌రైజర్స్‌ సాధించిన స్కోరు 148 పరుగులు. దీంతో గతంలో 2014లో పంజాబ్‌, 2021లో ముంబయి చేసిన 131 పరుగుల రికార్డు బ్రేక్ అయింది. అలాగే ఈ మ్యాచ్​ లో ముంబయి ఇండియన్స్ ​పై సన్‌ రైజర్స్‌ హైదరాబాద్​ సాధించిన స్కోరు 277/3. ఈ స్కోర్ ఐపీఎల్‌ చరిత్రలోనే ఓ జట్టు సాధించిన అత్యధిక స్కోరు. గతంలో 2013 లో పుణె వారియర్స్‌ పై ఆర్సీబీ సాధించిన 263/5 పరుగుల రికార్డ్ ను బ్రేక్ చేసారు.

Also read: MLC Elections: మహబుబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సర్వం సిద్దం..

ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే పురుషుల టీ20ల్లో నేపాల్‌ (314/3), అఫ్గానిస్థాన్‌ (278/3) టీమ్స్​ మాత్రమే సన్‌రైజర్స్‌ కన్నా ఇప్పుడు ముందున్నాయి. ఇక సన్​ రైజర్స్ హెడ్‌, అభిషేక్‌ బ్యాటింగ్ ద్వయం ఓ రికార్డ్ సాధించింది. ఐపీఎల్ ​లోని ఒకే మ్యాచులో ఒకే జట్టు నుంచి 20 బంతుల్లోగా హాఫ్​ సెంచరీలు బాదిన తొలి ద్వయంగా నిలిచారు.

Exit mobile version