Gautam Gambhir IPL 2024: లక్నో సూపర్ జెయింట్స్‌కు గౌతమ్ గంభీర్ గుడ్‌బై.. మళ్లీ కేకేఆర్‌తో ప్రయాణం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Gambhir Joins KKR Ahead of IPL 2024: భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్‌కు గుడ్‌బై చెప్పారు. మళ్లీ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)లో తిరిగి చేరుతున్నాని అధికారికంగా ప్రకటించారు. గంభీర్ నిర్ణయాన్ని కేకేఆర్ ఓనర్ షారుక్ ఖాన్ స్వాగతించారు. ఐపీఎల్ 2024లో తమ జట్టుకు మెంటార్‌గా సేవలు అందిస్తారని కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ బుధవారం ప్రకటించారు. లక్నో జట్టుకు రెండేళ్ల పాటు గౌతీ మెంటర్‌గా పని చేశారు.
లక్నో సూపర్ జెయింట్స్‌ను వీడుతున్న సందర్భంగా గౌతమ్ గంభీర్ ఓ భావోద్వేగ పోస్ట్ చేశారు. ‘లక్నో సూపర్ జెయింట్స్‌తో నా అద్భుతమైన ప్రయాణం ముగిసింది. ఈ ప్రయాణాన్ని చిరస్మరణీయం చేసిన ఆటగాళ్లు, కోచ్‌లు, సపోర్టింగ్ స్టాఫ్, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. నా ప్రయత్నాలన్నింటికీ మద్దతుగా నిలిచిన ఫ్రాంఛైజీ యాజమాని డా సంజీవ్ గోయెంకాకు ప్రత్యేక ధన్యవాదాలు. లక్నో జట్టు భవిష్యత్తులో అద్భుతాలు చేస్తుందని, ప్రతి ఎల్ఎస్జీ అభిమానిని గర్వించేలా చేస్తుందని అనుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ ఎల్ఎస్జీ బ్రిగేడ్’ అని గౌతీ పేర్కొన్నారు.
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
Also Read: Mohammed Shami: నువ్ క్రికెట్లో ఎలా భాగమయ్యావో తెలియడం లేదు.. పాకిస్తాన్ మాజీపై షమీ ఫైర్!
ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో చేరుతున్నట్లు గౌతమ్ గంభీర్ మరో పోస్ట్ చేశారు. ‘నేను తిరిగొచ్చేశాను. నాకు ఆకలిగా ఉంది. నేను నంబర్ 23. నేను కేకేఆర్‌ను ప్రేమిస్తున్నా’ అని గంభీర్ ట్వీట్ చేశారు. 2012, 2014 సీజన్లలో కేకేఆర్‌ను గౌతీ ఛాంపియన్‌గా నిలిపారు. రిటైర్మెంట్ అనంతరం కేకేఆర్‌కు మెంటార్‌గా పనిచేశారు. రెండేళ్ల కిందట కేకేఆర్‌ని వదిలి లక్నోకు మెంటార్‌గా నియమితుడయ్యారు. ఇప్పుడు తిరిగి కోల్‌కతాకు మెంటార్‌గా వ్యవహరించనున్నారు. గంభీర్ మార్గనిర్దేశంలో లక్నో 2022లో ఫైనల్‌కు చేరగా.. 2023లో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది.
I’m back. I’m hungry. I’m No.23. Ami KKR ❤️❤️ @KKRiders pic.twitter.com/KDRneHmzN4
— Gautam Gambhir (@GautamGambhir) November 22, 2023
❤️❤️ LSG Brigade! pic.twitter.com/xfG3YBu6l4
— Gautam Gambhir (@GautamGambhir) November 22, 2023
తాజావార్తలు
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!