NTV Telugu Site icon

Gautam Gambhir IPL 2024: ల‌క్నో సూపర్‌ జెయింట్స్‌కు గౌతమ్ గంభీర్‌ గుడ్‌బై.. మళ్లీ కేకేఆర్‌తో ప్రయాణం!

Gautam Gambhir Ipl 2024

Gautam Gambhir Ipl 2024

Gautam Gambhir Joins KKR Ahead of IPL 2024: భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్‌కు గుడ్‌బై చెప్పారు. మళ్లీ కోల్‌కతా నైట్ రైడర్స్‌ (కేకేఆర్‌)లో తిరిగి చేరుతున్నాని అధికారికంగా ప్రకటించారు. గంభీర్ నిర్ణ‌యాన్ని కేకేఆర్‌ ఓన‌ర్ షారుక్ ఖాన్ స్వాగ‌తించారు. ఐపీఎల్ 2024లో తమ జట్టుకు మెంటార్‌గా సేవలు అందిస్తారని కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ బుధవారం ప్రకటించారు. ల‌క్నో జ‌ట్టుకు రెండేళ్ల పాటు గౌతీ మెంట‌ర్‌గా పని చేశారు.

లక్నో సూపర్ జెయింట్స్‌ను వీడుతున్న సందర్భంగా గౌతమ్ గంభీర్ ఓ భావోద్వేగ పోస్ట్ చేశారు. ‘లక్నో సూపర్ జెయింట్స్‌తో నా అద్భుతమైన ప్రయాణం ముగిసింది. ఈ ప్రయాణాన్ని చిరస్మరణీయం చేసిన ఆటగాళ్లు, కోచ్‌లు, సపోర్టింగ్‌ స్టాఫ్, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. నా ప్రయత్నాలన్నింటికీ మద్దతుగా నిలిచిన ఫ్రాంఛైజీ యాజమాని డా సంజీవ్ గోయెంకాకు ప్రత్యేక ధన్యవాదాలు. లక్నో జట్టు భవిష్యత్తులో అద్భుతాలు చేస్తుందని, ప్రతి ఎల్‌ఎస్‌జీ అభిమానిని గర్వించేలా చేస్తుందని అనుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ ఎల్‌ఎస్‌జీ బ్రిగేడ్’ అని గౌతీ పేర్కొన్నారు.

Also Read: Mohammed Shami: నువ్ క్రికెట్‌లో ఎలా భాగమయ్యావో తెలియడం లేదు.. పాకిస్తాన్ మాజీపై షమీ ఫైర్!

ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ (కేకేఆర్‌)తో చేరుతున్నట్లు గౌతమ్ గంభీర్ మరో పోస్ట్ చేశారు. ‘నేను తిరిగొచ్చేశాను. నాకు ఆకలిగా ఉంది. నేను నంబర్ 23. నేను కేకేఆర్‌ను ప్రేమిస్తున్నా’ అని గంభీర్ ట్వీట్ చేశారు. 2012, 2014 సీజన్లలో కేకేఆర్‌ను గౌతీ ఛాంపియన్‌గా నిలిపారు. రిటైర్మెంట్ అనంతరం కేకేఆర్‌కు మెంటార్‌గా పనిచేశారు. రెండేళ్ల కిందట కేకేఆర్‌ని వదిలి లక్నోకు మెంటార్‌గా నియమితుడయ్యారు. ఇప్పుడు తిరిగి కోల్‌కతాకు మెంటార్‌గా వ్యవహరించనున్నారు. గంభీర్‌ మార్గనిర్దేశంలో లక్నో 2022లో ఫైనల్‌కు చేరగా.. 2023లో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది.

Show comments