NTV Telugu Site icon

IPL Final KKR vs SRH: చెన్నైలో ఐపీఎల్ ముగింపు వేడుకలు.. రచ్చ రచ్చే..!

Closing Cermony

Closing Cermony

IPL 2024 Final: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) నేటితో ముగియనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడేందుకు రెడీ అయింది. ఈ ఫైనల్ పోరులో కు ముందు ముగింపు వేడుకలు జరగబోతున్నాయి. ఈసారి ముగింపు వేడుకలు కలర్‌ఫుల్ గా కొనసాగనుంది. ఇందుకోసం ప్రపంచ ప్రఖ్యాత అమెరికన్ రాక్ బ్యాండ్ ఇమాజిన్ డ్రాగన్స్ అందించనుంది. ఈ వార్తను స్టార్ స్పోర్ట్స్ వెల్లడించింది. బ్యాండ్ ప్రధాన గాయకుడు డాన్ రేనాల్డ్స్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Read Also: MLC Polling: ఎమ్మెల్సీ పోలింగ్ ఏర్పాట్లు.. అక్కడ భద్రత కట్టుదిట్టం..

కాగా ఐపీఎల్ ఫైనల్స్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగబోతున్నాయి. దీంతో ఐపీఎల్ ముగింపు వేడుకలు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది.. ఫైనల్ మ్యాచ్‌కు ముందు అమెరికన్ రాక్ బ్యాండ్ ఇమాజిన్ డ్రాగన్స్ ప్రత్యేక కచేరీని ప్రదర్శిస్తుంది. బిలీవర్ అనే ప్రసిద్ధ ఇంగ్లీష్ పాటను ఇమాజిన్ డ్రాగన్స్ స్టేడియంలో ప్రదర్శన ఇవ్వనున్నారు.

Read Also: Gold Rate: మహిళలు గుడ్ న్యూస్.. బంగారం ధర ఢమాల్.. వారం రోజుల్లో ఏకంగా..

ఇక, కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌లో టాస్ రాత్రి 7 గంటలకు టాస్ వేయనున్నారు. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా, కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ జట్లు ఇప్పటి వరకు 27 సార్లు పోటి పడగా.. కేకేఆర్ 18 సార్లు విజయం సాధించగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మాత్రం కేవలం 9 సార్లు మాత్రమే గెలిచింది. ముఖ్యంగా కోల్ కతా నైట్ రైడర్స్ ఈసారి ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ఘన విజయం సాధించింది.