NTV Telugu Site icon

Deepak Chahar: సీఎస్‌కే కెప్టెన్ ఎవరో తెలియక తికమక పడుతున్నా: దీపక్ చహర్

Deepak Chahar Csk

Deepak Chahar Csk

Deepak Chahar Said I got to look at MS Dhoni and at Ruturaj Gaikwad: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కెప్టెన్సీపై ఆ జట్టు స్టార్ బౌలర్ దీపక్ చహర్‌ ఫన్నీ కామెంట్స్ చేశాడు. సీఎస్‌కే కెప్టెన్ ఎవరో తెలియక తాను కాస్త తికమక పడుతున్నా అని పేర్కొన్నాడు. బౌలింగ్‌ చేసే సమయంలో తాను మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, ప్రస్తుత సారథి రుతురాజ్‌ గైక్వాడ్ వైపు చూస్తున్నా అని చెప్పుకొచ్చాడు. సీఎస్‌కే కెప్టెన్‌గా ధోనీ స్వయంగా తప్పుకోవడంతో.. ఐపీఎల్ 2024లో జట్టు పగ్గాలను రుతురాజ్‌ అందుకున్న విషయం తెలిసిందే. ఎంతో అనుభవం ఉన్న మహీ.. మైదానంలో రుతురాజ్‌కు సలహాలు, సూచనలు ఇస్తున్న సంగతి తెలిసిందే.

మంగళవారం రాత్రి గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌ అనంతరం దీపక్ చహర్‌ మాట్లాడుతూ.. మైదానంలో ఎంఎస్ ధోనీ, రుతురాజ్‌‌‌ గైక్వాడ్‌లలో ఎవరి ఆదేశాలు వినాలో తెలియట్లేదని అన్నాడు. ‘మైదానంలో సూచనల కోసం ధోనీ, రుతురాజ్‌లలో ఎవరివైపు చూడాలో తెలియక కాస్త తికమక పడుతున్నా. అందుకే ఇద్దరివైపు చూస్తున్నా. రుతురాజ్ జట్టును గొప్పగా నడిపిస్తున్నాడు’ అని చహర్‌ తెలిపాడు. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో చహర్‌ రెండు కీలక వికెట్లు తీశాడు. గుజరాత్ ఓపెనర్లు వృద్ధిమాన్‌ సాహా (21), శుభ్‌మన్‌ గిల్ (8)ను ఔట్ చేశాడు. తన కోటా నాలుగు ఓవర్లలో 28 పరుగులు ఇచ్చాడు.

Also Read: SRH vs MI: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌.. రోహిత్ శర్మకు చాలా ప్రత్యేకం!

ఒకే ఓవర్‌లో రెండు బౌన్సర్లు వేసేందుకు అవకాశం కల్పిస్తూ.. ఐపీఎల్‌ నిర్వాహకులు కొత్త రూల్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనిపై దీపక్ చహర్‌ స్పందిస్తూ… ‘ఐపీఎల్ కెరీర్ ఆరంభం నుంచి నేను పవర్‌ప్లేలో 3 ఓవర్లు బౌలింగ్ చేస్తున్నాను. నేను దానికి అలవాటు పడ్డాను. కొత్త నిబంధనలతో వీలైనంత బాగా బౌలింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఇదివరకు ఓవర్‌లో తొలి 3 బంతుల్లో బౌన్సర్‌ వేస్తే.. మిగతావి లైన్‌ అండ్ లెంగ్త్‌తో వస్తాయని బ్యాటర్లు అంచనా వేసేవారు. ఇప్పుడు ఒకే ఓవర్‌లో రెండు బౌన్సర్లు వేసే అవకాశం లభించింది. దీంతో బ్యాటర్లపై బౌలర్లు పైచేయి సాధించేందుకు అవకాశం ఉంది. కొత్త రూల్ పేసర్లకు చాలా ఉపయోగకరం’ అని చెప్ప్పుకొచ్చాడు.

Show comments