ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా ఇవాళ ( ఏప్రిల్ 7) లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. భారతరత్న అటల్ బిహారి స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ప్రారంభంకాబోయే ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు భారీ మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొలుత లక్నో సూపర్ జెయింట్స్ విషయానికి వస్తే.. ఈ జట్టులో రెండు మార్పులకు ఆస్కారం ఉంది. మార్కస్ స్టొయినిస్ స్థానంలో సఫారీ వికెట్ కీపర్ క్వింటర్ డికాక్ కు తుది జట్టులో చోటు దరకవచ్చు. జయదేవ్ ఉనద్కత్ ను ఫైనల్ ఎలెవన్ లో ఆడించవచ్చు. పేసర్ యశ్ ఠాకూర్ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఉండే అవకాశం ఉంది.
Also Read : RK Roja: ప్రజల్లో పవన్ కల్యాణ్ పై నమ్మకం లేదు
ఇక మన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విషయానికొస్తే.. రెగ్యులర్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ ఈ మ్యాచ్ లో తప్పక బరిలో ఉంటాడు. తొలి మ్యాచ్ లో కెప్టెన్సీ చేసిన భువీ వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. వికెట్ కీపర్ కోటాలో గ్లెన్ ఫిలిప్స్ కు బదులు హెన్రిచ్ క్లాసెన్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే ఇంపాక్ట్ ప్లేయర్ గా ఉండవచ్చు.
Also Read : Apple CEO Tim Cook : రోజు కస్టమర్స్ రివ్యూ చదువుతా.. టీమ్ కుక్
సన్ రైజర్స్ హైదరాబాద్: మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్రమ్( కెప్టెన్ ), హెన్రిచ్ క్లాసెన్( వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, టీ. నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, ఫజల్ ఫారూజీ, మాయంక్ మార్కండే( ఇంపాక్ట్ ప్లేయర్ )
లక్నో సూపర్ జెయింట్స్ : కేఎల్ రాహుల్( కెప్టెన్), క్వింటన్ డికాక్ ( వికెట్ కీపర్ ), కైల్ మేయర్స్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్, కృష్ణప్ప గౌతమ్, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్, జయదేవ్ ఉనద్కత్, ఆవేశ్ ఖాన్, యశ్ ఠాకూర్( ఇంపాక్ట్ ప్లేయర్ )