NTV Telugu Site icon

IPL 2023 Retention: ముగిసిన రిటెన్షన్ ప్రక్రియ.. ఏ ఫ్రాంచైజీ దగ్గర ఎంత డబ్బుంది?

Ipl 2023 Retention

Ipl 2023 Retention

IPL 2023 Retention: ఐపీఎల్ 2023 సీజన్‌కు సంబంధించి రిటెన్షన్ ప్రక్రియ ముగిసింది. నవంబర్ 15వ తేదీ వరకు మాత్రమే బీసీసీఐ గడువు ఇవ్వడంతో అన్ని ఫ్రాంచైజీలు రిటైనింగ్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. డిసెంబర్ 23న కేరళలోని కొచ్చి వేదికగా మినీ వేలం జరగనుంది. కొందరు ఆటగాళ్లను ఫ్రాంచైజీలు వదిలివేశాయి. దీంతో ఆయా ఫ్రాంచైజీల పర్సు పెరిగింది. అత్యధికంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు 16 మంది ఆటగాళ్లను, ముంబై ఇండియన్స్ 13 మంది ఆటగాళ్లను వేలంలోకి వదిలేయగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ 12 మంది ఆటగాళ్లను రిలీజ్ చేసింది. అయితే ఆటగాళ్లను వదిలిపెట్టిన తర్వాత అత్యధిక పర్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ వద్ద ఉంది. ఆ జట్టు వద్ద రూ.42.25 కోట్ల పర్స్ మిగిలి ఉంది. ఈ జాబితాలో రెండో స్థానంలో పంజాబ్ కింగ్స్ ఉంది. ఆ జట్టు వద్ద రూ.32.2 కోట్ల పర్స్ ఉంది.

Read Also: IPL 2023: ఏకంగా 13 మంది ఆటగాళ్లను వదులుకున్న ముంబై ఇండియన్స్

మిగతా జట్ల పర్స్ వివరాలను పరిశీలిస్తే.. లక్నో సూపర్ జెయింట్స్ వద్ద రూ.23.35 కోట్లు, ముంబై ఇండియన్స్ వద్ద రూ.20.55 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ. 20.45 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద రూ. 19.45 కోట్లు, గుజరాత్ టైటాన్స్ వద్ద రూ.19.25 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ వద్ద రూ.13.2 కోట్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వద్ద రూ.8.75 కోట్ల పర్స్ ఉంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు వద్ద అత్యల్పంగా రూ.7.05 కోట్ల పర్స్ మాత్రమే ఉంది. ఆశ్చర్యకరంగా సన్‌రైజర్స్ జట్టు కెప్టెన్ విలియమ్సన్‌ను వేలంలోకి విడిచిపెట్టి అందరినీ ఆశ్చర్యపరించింది. పంజాబ్ కింగ్స్ జట్టు కూడా గత సీజన్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్‌ను విడుదల చేసింది. అయితే వచ్చే సీజన్‌లో ఆ జట్టుకు శిఖర్ ధావన్ నాయకత్వం వహించనున్నాడు.