Site icon NTV Telugu

IPL 2023 : ఆర్సీబీతో గుజరాత్ ఢీ.. వర్షం దెబ్బకి టాస్ ఆలస్యం..

Kohli

Kohli

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. అయితే వర్షం కారణంగా టాస్ ఆలస్యం కానుంది. ఈ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ కంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చాలా కీలకమని చెప్పొచ్చు. ఎందుకంటే.. ఇప్పటికే గుజరాత్‌ టైటాన్స్‌ 18 పాయింట్లతో టేబుల్‌ టాపర్‌గా ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. గుజరాత్‌పై ఆర్‌సీబీ గెలిస్తేనే ప్లేఆఫ్‌కు చేరుకుంటుంది.. లేదంటే ఇంటిబాట పట్టాల్సిందే. అయితే మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉండడం బెంగళూరు అభిమానులను ఆందోళనకు గురి చేస్తుంది.

Also Read : IPL 2023: దూకుడుగా ఆడుతున్న ముంబై.. 10 ఓవర్లకు స్కోర్..?

ఈ మ్యాచ్ సజావుగా జరిగి, ఫలితం తేలడం ఆర్‌సీబీకి అత్యంత అవసరం. అయితే 13 మ్యాచుల్లో 7 విజయాలతో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నేటి మ్యాచ్‌లో గెలిస్తేనే 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కి చేరుకోగలుగుతుంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయినా, ఆర్‌సీబీ మ్యాచ్ ఓడిపోయినా ముంబై ఇండియన్స్‌కి ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫార్మ్ అవుతుంది. ప్లేఆఫ్స్ బెర్తులను కన్ఫార్మ్ చేసేందుకు తప్పక ఫలితం తేలాల్సిన మ్యాచ్ కావడంతో వర్షం తగ్గి రాత్రి 10 గంటల 56 నిమిషాలకు ప్రారంభం అయినా చెరో 5 ఓవర్లతో మ్యాచ్‌ని నిర్వహిస్తారు. అదే జరిగితే ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 5 ఓవర్ల థ్రిల్లర్ చూసే అవకాశం ఫ్యాన్స్‌కి దక్కుతుంది. అయితే అది జరగాలంటే వర్షం ఆగి, పిచ్ మ్యాచ్ ఆడేందుకు అణువుగా ఉండాలి.

Also Read : Gadala Srinivas Rao : వనమా రాజకీయాల్లో నుంచి తప్పుకోవాలి

అయితే నిన్నటి నుంచి బెంగళూరులో ఎడతెడపి లేకుండా వర్షాలు కురుస్తాయి. నేటి మధ్యాహ్నం కూడా బెంగళూరులో వడ గండ్ల వాన కురిసింది. దీంతో నేడు ఆర్‌సీబీ, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగడం దాదాపు అసాధ్యమేనని తెలుస్తోంది. మంగళవారం మే 23న చెన్నై సూపర్ కింగ్స్‌తో మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడనుంది గుజరాత్ టైటాన్స్..

Exit mobile version