Site icon NTV Telugu

IPL 2023: ముంబై ఇండియన్స్ ఉమెన్స్ జెర్సీతో బరిలోకి రోహిత్ సేన

Mi

Mi

ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన ముంబై ఇండియన్స్ జట్టు ఆదివారం వాంఖెడ్ స్టేడియంలో కోల్ కతా నైట్ రైడర్స్ తో జరుగబోయే మ్యాచ్ లో ప్రత్యేక జెర్సీతో కనిపించనుంది. ఈ మ్యాచ్ కు రోహిత్ సేన.. రిసెంట్ గా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ టీమ్ కప్ గెలిచింది. అయితే ఈ మ్యాచ్ లో మహిళల జెర్సీని రోహిత్ సేన ధరించనున్నారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ముంబై ఆటగాళ్లు వేసుకునే జెర్సీలతో పాటు ఇందుకు గల కారణాలను వెల్లడించింది.

Also Read : LSG vs PBKS: లక్నోపై పంజాబ్ కింగ్స్ సంచలన విజయం.. లాగేసుకున్నారుగా!

రోహిత్ సేన ఇలా ముంబై ఇండియన్స్ మహిళల జెర్సీ వేసుకోవాడానికి వెనుక బలమైన కారణం ఉంది. రిలయన్స్ ఆధ్వర్యంలో నడిచే ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫర్ ఆల్ క్యాంపెయిన్ లో భాగంగా ముంబై ప్లేయర్స్ ఈ జెర్సీని ధరించననున్నారు. ఆడపిల్లలకు విద్య, క్రీడల్లో ప్రోత్సాహం కల్పిస్తూ వారికి క్రీడా రంగంలో కావాల్సిన మద్దతును అందివ్వడం ఈఎస్ఏ ప్రధాన ఉద్దేశం. ఈఎస్ఏ ఫౌండేషన్ డే ను పురస్కరించుకుని వారిలో స్పూర్తిని నింపేందుకు గాను ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ ఇవాళ ఈ జెర్సీతో బరిలోకి దిగనున్నారు.

Also Read : IPL 2023: అతను మా బంగారు కొండ అంటున్న పంజాబ్ కింగ్స్

ఈఎస్ఏ ఫౌండేషన్ డే లో భాగంగా కేకేఆర్ తో ఆడబోయే మ్యాచ్ ను ముంబై ఇండియన్స్ ఏకంగా 36 ఎన్జీవోలలోని 19 వేల మంది చిన్నారులకు ప్రత్యక్షంగా మ్యాచ్ చూపించనున్నారు. వీరిలో 200 మంది స్పెషల్లీ ఏబుల్డ్ చిల్ట్రన్ కూడా ఉన్నారు. ఈ మేరకు ముంబై ఇండియన్స్ యాజమాన్యం అన్ని ఏర్పాట్లను చేసినట్లు నీతా అంబానీ తెలిపారు. ఈ మేరకు ముంబై ఇదివరకే అన్ని ఏర్పా్ట్లను పూర్తి చేసింది. చిన్నారులను వాంఖెడ్ కు తరలించడానికి 500 ప్రైవేట్ బస్సులు, 2 వేల మంది వాలంటీర్లను సిద్దం చేసింది. అంతేకాదు వీరికి ఆహారం అందించేందుకు కూడా ఒక లక్ష ఫుడ్ పాకెట్స్, నీటి సదుపాయాన్ని కూడా కల్పించింది. మ్యాచ్ చూడటానికి వచ్చే చిన్నారులంతా ఇవాళ వాంఖెడ్ స్టేడియంలో ఈఎస్ఏ టీ షర్ట్ లతో రోహిత్ సేనను ఎంకరేజ్ చేయనున్నాయి.

Also Read : Atik Ahmad: అతీక్ అహ్మద్ హత్య.. మెడికల్ చెకప్ కోసం తీసుకెళ్తుండగా..

ముంబై ఇండియన్స్ ట్విట్టర్ అకౌంట్ లో ఈ వీడియో పోస్ట్ చేసినట్లు నీతా అంబానీ వెల్లడించారు. 19 వేల మంది చిన్నారులు తమ అభిమాన క్రికెటర్లను నేరుగా చూసేందుకు గాను రాబోతున్నారు. వారిలో స్పూర్తి రగల్చడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మ్యాచ్ కు అమ్మాయిల తరపున ముంబై ఇండియన్స్ మహిళా జట్టు సారథి హర్మన్ ప్రీత్ కౌర్ కూడా రాబోతుందని.. టాస్ వేసే సమయంలో కూడా ఆమె అక్కడే ఉంటుందని నీతా అంబానీ పేర్కొన్నారు.

Exit mobile version